Templesinindiainfo

Best Spiritual Website

About Ganesh Temple Secunderabad in Telugu, History, Timings, Poojas

Secunderabad Ganesh Temple Timings:

Morning: 5.30 AM to 1.00 PM
Evening: 4.00 PM to 8.30 PM

అలనాటి నైజాము రాష్ట్రము రాజధానిగా ఉన్న హైదరాబాద్ (భాగ్యనగరము)నందు (ముచికుంద) మూసీ నదికి సుమారు 9 కి మీ దూరములో ప్రస్తుత సికింద్రాబాద్ నగరము రైల్వేస్టేషన్ సమీపములో ప్రశాంత వాతావరణములో శ్రీ యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానమునకు 46 కిలోమీటర్ల దూరములో సుమారు 2 శతాబ్దముల చరిత్ర కలిగి భక్తుల కోరికలను తీర్చుటలో కొంగు బంగారముగా అలరారుతున్నది.

Secunderabad Ganesh Temple స్థల పురాణము:

శ్రీ గణపతి దేవాలయము సుమారు రెండు వందల సంవత్సరముల అనగా కీ॥శ. 1824 సం॥ దీనికి సరియగు శక సం॥ 1745 తెలుగు సం॥ స్వస్తిశ్రీ స్వభాను నామ సం॥లో గర్భాలయములో వెలసియున్న శ్రీ గణపతి స్వామివారి విగ్రహము రూపొందించినట్లుగా ఆధారము విగ్రహం కింది భాగంలో నిరూపించబడుచున్నది.

ప్రస్తుతము స్వామివారు పూజలు అందుకొనుచున్న ప్రాంతము అప్పటి నైజాము రాజులయేలుబడిలో ఉండి చిన్నచిన్న పల్లెలుగా ఉండినవి. 1862 సంవత్సరము నైజాము నవాబులు సరుకు రవాణా నిమిత్తము రైల్వే ట్రాక్స్ ప్రారంభం చేసినారని రైల్వే లైన్ నిర్మాణము చేయుచున్న సమయములో వారికి విఘ్నములు ఏర్పడినవి అప్పుడు ప్రస్తుత రైల్వే స్టేషన్ శ్రీ గణపతి ఆలయము గల స్థలము వ్యవసాయ భూమియని అట్టి వ్యవసాయ భూమిలో దిగుడు బావి ఉండేదని ఆ బావిని నీటి సౌకర్యార్ధం బాగుచేయు సమయములో శ్రీ స్వామివారి విగ్రహం బావిలో లభ్యమైనదని పెద్దలు (పూర్వీకులు) చెప్పుచున్నారు.

పైనతెలుపబడిన ఆ విగ్రహము చతుర్భుజములు కలిగి కుడి చేతులలో అంకుశము ఎడమ చేతిలో డమరుపాశం కలిగి, క్రింది చేయి కతిమోకాలిపై ముద్రలో బోర్లించుకొని ఎడమచేతిలో బీజాపూర ఫలము కలిగి బింబముపై కుడివైపు చంద్రవంక ఎడమవైపు సూర్య బింబము కలిగి కుబేరస్థానము (ఉత్తరము) వైపు వెళ్ళు మూషికారూరుడై వెలసిన స్వామి భారతావనిలోనే విభిన్న రూపము విరుపాక్ష గణపతి రూపంలో గణేశ పురాణము వివరించినట్టు శ్రీ గణపతి స్వామి వారి బాల్యములో ఉపనయన కాలము లో సమస్త దేవతలు సమస్త ఆయుధములు బహుమతిగా ఇవ్వగా ఈశ్వరుడు సాక్షాత్ తన రూపమైన (ఆత్మావై పుత్రనామాసి) అన్నట్లుగా తనయొక్క డమరుకము బహుమతిగా మొసంగి విరుపాక్ష గణపతిగా నామకరణము చేసినట్లు చెప్పబడియున్నది. కావున ఆ స్వామి వారు విరూపాక్ష గణపతి అవతారములో ఉన్న బింబమనుచుఅప్పటి నైజాము రాష్ట్ర అధికారులు రైల్వే కార్మికులు శ్రీ స్వామి వారిని ఆరాధించి విఘ్నములు తొలగించుకొని రైల్వే లైను పూర్తిచేసినట్లు తదనంతర కాలంలో అప్పటి బ్రిటిష్ అధికారులు మందిరా నిర్మాణము నకు అడ్డు చెప్పాడా స్వామివారు స్వప్నములో దర్శనము ఇచ్చినట్లు తర్వాత వారి అడ్డంకులు కూడా తొలగినట్లు అప్పటి రైల్వే అధికారి సంతాన నిమిత్తం స్వామివారిని ఆరాధించి సంతానము పొంది ఆలయ నిర్మాణము గావించినారని పెద్దలు (పూర్వీకులు) స్వామివారి లీలలు వివిధములుగా చెప్పుకొనుచుందురు.

అట్టి శ్రీహరి ఆలయము కాలక్రమములో వివిద అభివృద్ధి చెంది తదనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రాజధానిగా ఉన్న హైదరాబాదులో అంతర్భాగమైన సికింద్రాబాద్ నందు 1969 సం॥లో దేవాదాయ ధర్మాదాయ పరిధిలో తీసుకొనబడినది.

ప్రస్తుత దేవాలయము గణపతి పంచాయతనము అనురీతిలో తన సహోదరుడైన శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి విష్ణుపరముగా శ్రీరామబంటు ఆంజనేయస్వామి తన మాతాపితరులైన శ్రీ ఉమా మహేశ్వరి సమేత ఉమామహేశ్వరులు శ్రీ ఆదిత్యాది నవ గ్రహములు మరియు శ్రీసరాహు కేతు నీలకంఠ విరధనారాయణి మానసా కుబ్జికా సమేత సర్పబంధ విగ్రహములు కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రపాలకుడిగా పటిష్ట గావింపబడి అత్యంత వైభవోపేతముగా అలరారుచున్నది.

సికింద్రాబాద్ గణపతి ఆలయ విశేషాలు:

శ్లో॥ ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ——– శ్రియమిచ్చేతు హుతాశనః
ఈశ్వరాత్ జ్జానమన్విచ్చేత్ ——– మోక్షమిచ్చేజ్జనార్ధనః
దుర్గాదిభిః తాధారక్షాం ——– బైరవాద్యస్తు దుర్గమమ్
విద్యాసారం సరస్వత్యాం ——– లక్ష్మ్యాచైశ్వ్యత్య వర్దనం
పార్వత్యాచైవసౌభాగ్యం శచ్యా ——– కళ్యాణ సంతతిః
స్కందాత్ ప్రజాభివృద్దిశ్చ ——– సర్వచైవ గణాధిపాత్

Secunderabad Sri Ganesh Temple

అను ప్రకారముగా శ్రీ గణపతి దేవాలయము నందు శ్రీ నవగ్రహ ఆలయములో సూర్యునితో కలిసి ఉన్న నవగ్రహ సమూహము న్న ఆరాధించినా ఆరోగ్యసిద్ధి అగ్నిహోత్రుని హోమ రూపములో శ్రీ గణపతి చండీ మన్యు రుద్ర సుబ్రహ్మణ్య ఆదిత్యాది నవగ్రహ ఇత్యాది హోమములు నిర్వహించగల ధన లాభము ఉమామహేశ్వర ఆరాధన వలన జ్ఞానము క్షేత్రపాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మోక్షము శ్రీ ఉమామహేశ్వర ఆరాదన వల్ల జ్ఞానము శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిని అయిన శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారి ఆరాధించుట వలనను సమస్త సన్మంగళములు సిద్ధించును హనుమత్ ఆరాధన వలన సమస్త శత్రు బాధలు ప్రయోగ బాధల నివారణ జరుగును ప్రత్యేకముగా శ్రీ మహాగణపతి (విరూపాక్ష గణపతి) పరబ్రహ్మ స్వరూపమైనందన ఆలయములో ఉన్న ఇతర దేవతా మూర్తులు పరివార దేవతలైనందున గణపతిని ఆరాధించుట వలన పైన పేర్కొనబడిన కోరికలు అన్నియు తీరుననుటలో సందేహము లేదు

అట్లే ఆలయములో వెలసిన సర్పబంధ విగ్రహములకు అభిషేకాదులు రాహు కేతు పూజ నిర్వహించడం వలన కాలసర్ప సర్ప దోషములు తొలగి భక్తుల అభీష్టం నెరవేరును.

Secunderabad గణపతి ఆలయములో జరుగు విశేష ఉత్సవములు:

1) ప్రదాన దేవాలయము శ్రీ గణపతి స్వామివారికి భాద్రపద మాసములుశు॥ చవితి నుండి పౌర్ణమి వరకు గణేశ ఉత్సవములు.
2) శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారికి ఆశ్వీజ మాసములో శరన్నవరాత్రి ఉత్సవములు అలంకారములు ప్రతి నిత్యము చండీ హవనం.
3) శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రతి సోమవారం ప్రతి మాస శివరాత్రి రోజులలోనే కాకుండా మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకములుకళ్యాణము మరియు కార్తీకమాసములో విశేష పూజ కైంకర్యములు నిర్వహించబడును
4) శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం కృత్తికా నక్షత్రము షష్ఠి తిథిలలో కాకుండా మార్గశిర శుద్ధ షష్టి రోజున విశేషం పూజలు కల్యాణము నిర్వహించబడును.
5) శ్రీ ఆంజనేయస్వామి వారికి ఆలయంలో ప్రతి మంగళ శని వారములు ప్రతి పూర్వాభాద్ర నక్షత్రం రోజున చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ విజయోత్సవం వైశాఖ బహుళ దశమి జన్మోత్సవం శ్రీరామ నవమి రోజున సీతారామ ప్రయాణము నిర్వహించబడును
6) ప్రతి మంగళ శని వారములు సర్పబంధ విగ్రహం సమీపంలో కాలసర్ప నివారణ పూజలు నిర్వహించబడును.
7) సంవత్సర కాలములో ప్రతిరోజూ సత్యనారాయణ వ్రతము.
8) ప్రతి శుక్రవారము సంకష్టహర చతుర్థి రోజున సత్యగణపతి వ్రతము నిర్వహించబడును.
9) ప్రతి శు॥ చవితి రోజున వినాయక శాంతి.
10) ప్రతి బహుళ చవితి రోజున అష్టోత్తరశత కలశాబిషేకము సాయంకాలము ఏకవింశతి కలశాభిషేకం నిర్వహించబడును.
11) శ్రీగణపతి స్వామి వారికి ప్రతి నిత్యము శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి కల్యాణము నిర్వహించబడును.
12) ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు పాంచాహ్నిక దీక్ష పూర్వకముగా సహస్ర కలశాభిషేకం పవిత్రోత్సవములు నిర్వహించబడును.

గణపతి ఆలయ Description:

శ్లో॥ ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ శ్రియమిచ్చేతు హుతాశనః ఈశ్వరాత్ జ్జానమన్విచ్చేత్ మోక్షమిచ్చేజ్జనార్ధనః దుర్గాదిభిః తాధారక్షాం బైరవాద్యస్తు దుర్గమమ్ విద్యాసారం సరస్వత్యాం లక్ష్మ్యాచైశ్వ్యత్య వర్దనం పార్వత్యాచైవసౌభాగ్యం శచ్యా కళ్యాణ సంతతిః స్కందాత్ ప్రజాభివృద్దిశ్చ సర్వచైవ గణాధిపాత్ ప్రకారముగా శ్రీ గణపతి దేవాలయము నందు శ్రీ నవగ్రహ ఆలయములో సూర్యునితో కలిసి ఉన్న నవగ్రహ సమూహము న్న ఆరాధించినా ఆరోగ్యసిద్ధి అగ్నిహోత్రుని హోమ రూపములో శ్రీ గణపతి చండీ మన్యు రుద్ర సుబ్రహ్మణ్య ఆదిత్యాది నవగ్రహ ఇత్యాది హోమములు నిర్వహించగల ధన లాభము ఉమామహేశ్వర ఆరాధన వలన జ్ఞానము క్షేత్రపాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మోక్షము శ్రీ ఉమామహేశ్వర ఆరాదన వల్ల జ్ఞానము శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిని అయిన శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారి ఆరాధించుట వలనను సమస్త సన్మంగళములు సిద్ధించును హనుమత్ ఆరాధన వలన సమస్త శత్రు బాధలు ప్రయోగ బాధల నివారణ జరుగును ప్రత్యేకముగా శ్రీ మహాగణపతి (విరూపాక్ష గణపతి) పరబ్రహ్మ స్వరూపమైనందన ఆలయములో ఉన్న ఇతర దేవతా మూర్తులు పరివార దేవతలైనందున గణపతిని ఆరాధించుట వలన పైన పేర్కొనబడిన కోరికలు అన్నియు తీరుననుటలో సందేహము లేదు అట్లే ఆలయములో వెలసిన సర్పబంధ విగ్రహములకు అభిషేకాదులు రాహు కేతు పూజ నిర్వహించడం వలన కాలసర్ప సర్ప దోషములు తొలగి భక్తుల అభీష్టం నెరవేరును.

Secunderabad Ganesh Temple Bhogamulu/Prasadam:

ఉండ్రాళ్ళు – Undrallu
పులిహోర – Pulihora
కట్టాపొంగళి – Kattapongali
దద్దోజనం – Daddojanam
సొందెలు – Sondelu
చక్కరపొంగళి – Chakkarapongali
వడమెలా – VadaMala

Secunderabad Ganesh Temple Saswatha Poojas:

అభిషేకం – Abishekam
రాజభోగం – Rajabogam
కళ్యాణం – Kalyanam
శాశ్వత హోమం – Saswatha Homam
శాశ్వత అన్నప్రసాదం – Saswatha Annaprasadam
ద్విచక్ర వాహనం – Two Wheeler
నాలుగు చక్రాల వాహనం – Four Wheeler

Secunderabad Ganesh Temple Online Booking For Poojas:

Other Poojas:

అమ్మవారి అభిషేకము – Amavari Abishakam
సామూహిక కుంకుమార్చన – Samuhika Kukumarchana

Rahu Ketu:

కాలసర్ప పూజ – Kalasarpa Pooja (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
రాహుకేతు అభిషేకం – Rahuketu Abishekam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)

Sri Anjaneya Swamy:

అభిషేకం – Abishekam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
అర్చన – Arachana (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)

Sri Ganapathi:

అభిషేకం – Abishekam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
అంతరాలయం అర్చన – Antaralaya Archana (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
అర్చన – Arachana (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
కళ్యాణం – Kalyanam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
గణపతి హోమం – Ganapathi Homam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
ముడుపు – Mudupu (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)

వినాయక శాంతి ప్రకరణం Vinayaka Shanthi Prakaranam (నెలవారీ పూజ – Monthly Pooja)
సంకష్టహర చతుర్థి – Sankastahara Chaturdhi (నెలవారీ పూజ – Monthly Pooja)

ఉగాది కలశాబిషేకం – Ugadi Kalash Abhiskekam (సంవత్సరాది పూజ Yearly Pooja)
శ్రీ వినాయక చవితి అభిషేకం స్పీసీల్ – Sri Vinayaka Chaviti Abishekam Special (సంవత్సరాది పూజ Yearly Pooja)
సహస్రమోదక హోమం – Sahasramodhaka homam (సంవత్సరాది పూజ Yearly Pooja)
మూలవరుల విశేషాలంకార సేవ – Chaviti Alamkaram (సంవత్సరాది పూజ Yearly Pooja)
లక్షభిల్వార్చన – Laksha Bilvarchana (సంవత్సరాది పూజ Yearly Pooja)
శ్రీ సిద్ది బుద్ది మహా గణపతి కళ్యణము – Sri Siddi Buddi Maha Ganapati Kalyanam (సంవత్సరాది పూజ Yearly Pooja)
సువర్ణ పుష్పార్చన – Suvarna Pushparchana (సంవత్సరాది పూజ Yearly Pooja)
Ganapati Vratham (సంవత్సరాది పూజ Yearly Pooja)
నూతన సంవత్సర విశేష అబిషేకము – New Year Spl Abishekam (సంవత్సరాది పూజ Yearly Pooja)
సహస్ర కలశాభిషేకము – Sashasra Kalasha Abhishekam (సంవత్సరాది పూజ Yearly Pooja)

Sri Navagraha:

తైలాభిషేకము – Thail Abishekam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
నవగ్రహ అర్చన – Navagraha Arachana (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
నవగ్రహ హోమం – Navagraha Homam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)

Sri Satyanarayana Swamy:

సత్యనారాయణ స్వామి వ్రతం – Satyanarayana Swamy Vrathan (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)

షష్టి మరియు కృత్తిక కళ్యానము – Shasti and kruthikha Kalyanam (సంవత్సరాది పూజ Yearly Pooja)

Sri Subramanya Swamy:

అభిషేకం – Abishekam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
కళ్యాణం – Kalyanam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
అర్చన – Arachana (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
హోమం – Homam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
షష్టి మరియు కృత్తిక కళ్యానము – Shasti and Kruthikha Kalyanam (నెలవారీ పూజ – Monthly Pooja)

సుబ్రమణ్య షష్టి అభిషేకము – Subramanya Sashti Abhishekam (సంవత్సరాది పూజ Yearly Pooja)
సుబ్రమణ్య షష్టి కళ్యానము – Subramanya Sashti Kalyanam (సంవత్సరాది పూజ Yearly Pooja)
సుబ్రమన్యస్వామి షష్టి హొమం – Subramanya Swamy Homam (సంవత్సరాది పూజ Yearly Pooja)

Sri Uma Maheswara Swamy:

అభిషేకం – Abishekam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
అర్చన – Arachana (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
కళ్యాణం – Kalyanam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
రుద్ర హొమాం – Rudhra Homam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
అన్నాభిషేకం – Annabishekam (సంవత్సరాది పూజ Yearly Pooja)
మహన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాబిషేకము – Mahanyasa Purvka Ekadash Shiva Abishakam(సంవత్సరాది పూజ Yearly Pooja)
రుద్ర సహిత గణపతి హొమం – Rudhra Sahitha Ganapati Homam(సంవత్సరాది పూజ Yearly Pooja)
లక్షభిల్వార్చన – Laksha Bilvarchana (Shivalayam)(సంవత్సరాది పూజ Yearly Pooja)
సహస్ర లింగార్చ – Sahasra Linga Archana(సంవత్సరాది పూజ Yearly Pooja)
కన్యాపాశుపతరుద్రహొమమ్ – Kanya pashupatha rudra homam(సంవత్సరాది పూజ Yearly Pooja)
సంతాన పాశుపత రుద్రహొమం – Santhana pashupatha homam(సంవత్సరాది పూజ Yearly Pooja)
కుబేరపాశుపత రుద్రహొమం – Kubera pashupatha rudra homam (సంవత్సరాది పూజ Yearly Pooja)
మహామృత్యుంజయ పాశుపత రుద్రహొమం – Maha muruthyuan jaya rudra homam(సంవత్సరాది పూజ Yearly Pooja)
రుద్రహొమంమహాపుర్ణాహుతి – Rudhra Homam(సంవత్సరాది పూజ Yearly Pooja)
శివరాత్రి కళ్యాణం – Shivarathri Kalyanam(సంవత్సరాది పూజ Yearly Pooja)
మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము – Mahanyasa Purvka Ekadash Rudrabhishekam (సంవత్సరాది పూజ – Yearly Pooja)

Sri Uma Maheswari Ammavaru:

అభిషేకం – Abishekam (రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
కుంకుమార్చన – KukumArachana(రోజువారీ/వారము పూజ – Daily/Weekly Pooja)
చండీహోమం – Chandihomam (నెలవారీ పూజ – Monthly Pooja)
చండీహొమమ్ – Candi homam (సంవత్సరాది పూజ – Yearly Pooja)
అమ్మవారి అభిషేకము – Amavari Abishekam(సంవత్సరాది పూజ – Yearly Pooja)
అమ్మవారి అలంకారం – Amavari Alamkaram (సంవత్సరాది పూజ – Yearly Pooja)
నిత్యము సహస్ర కుంకుమ అర్చన – Nithay Sahasarkunkum Arachana (సంవత్సరాది పూజ – Yearly Pooja)
సామూహిక కుంకుమార్చన – Samuhika Kukumarchana(సంవత్సరాది పూజ – Yearly Pooja)

Click Here to Book Online:

Secunderabad Ganesh Sub Temples:

Sri Anjaneya Swamy శ్రీ ఆంజనేయ స్వామి
Sri Ganapathi శ్రీ గణేష్
Sri Navagraha శ్రీ నవగ్రహ
Sri Satyanarayana Swamy శ్రీ సత్యనారాయణ స్వామి
Sri Subramanya swamy శ్రీ సుబ్రమణ్య స్వామి
Sri Uma Maheswara Swamy శ్రీ ఉమా మహేశ్వర స్వామి
Sri Uma Maheswari Ammavaru శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారు

Secunderabad Ganesh Temple Address:

శ్రీగణపతి దేవాలయము
స్టేషన్ రోడ్,
సికింద్రాబాద్
తెలంగాణ రాష్ట్రము.
ఫోన్ 040 27701885 ఈ ఓ నెం 9491000657

About Ganesh Temple Secunderabad in Telugu, History, Timings, Poojas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top