Templesinindiainfo

Best Spiritual Website

Sevas at Sri Kalahasteeswara Swamy Temple, Price Details, Pooja, Address

1. గోపూజ (ఒకరికి ) :  Rs. 50.00 / Go Pooja (for one person)

సమయము – ఉదయం : 4.30 A.M శని , ఆది , సోమ వారము
ఉదయం :5.00 A.M., మంగళ , బుధ , గురు , శుక్ర వారము
గోకులము నందు గోపూజ ఉదయం : 7.00 నుండి 11.00 వరకు
సాయంత్రం: 4.00 నుండి 6.00 వరకు
ఈ గోపూజ ఉదయాన్నే అనగా గుడి తలుపులు తెరవగా గుడి లోపల స్వామి అమ్మవారి ప్రదక్షణగా ప్రాకారమంత నిర్వహిస్తారు. ఈ సేవకు ఒక టిక్కెట్ కి ఒకరిని మాత్రమే పంపుతారు. ఈ గోపూజానంతరం సుప్రభాత సేవకు మరియు శ్రీస్వామి ,అమ్మవార్ల దర్శనం అనుమతించబడును. తదుపరి గోకులం లో ఉంచి ఉదయం 7.00గం.లనుండి 11.00గం.ల వరకు మరియు సాయంత్రం 4.00 గం.ల నుండి గోపూజ 6.00గం.లవరకు నిర్వహిస్తారు.

2. సుప్రభాత సేవ (ఒకరికి ) : Rs. 50.00/ Suprabhata Seva (for one person)

సమయము – ఉదయం : 5.00 గం.లకు శని , ఆది , సోమ వారముల యందు మరియు 5.30 గం.లకు మంగళ , బుధ , గురు, శుక్ర వారము
ఈ సుప్రభాత సేవ శ్రీస్వామి అమ్మవార్లు శయన మందిరము నందు నిర్వహించబడును. శ్రీ సుప్రభాత పఠనము జరుగును. ఈ సేవ అయిన తరువాత శ్రీస్వామి అమ్మవార్లను దర్శనము చేసుకొనవచ్చును. ఈ సేవకు ఒక టిక్కెట్టుకు ఒక్కరిని మాత్రము పంపుతారు.

3. ఉచిత దర్శనం : Free Darshanam

సమయము – శని , ఆది , సోమ వారాలలో ఉదయం 5.30గం.ల నుండి 9.30 గం.ల వరకు మరియు ఉదయం 6.00 గం.ల నుండి రాత్రి 9.00 వరకు మంగళ , బుధ , గురు , శుక్ర వారము శ్రీ స్వామి అమ్మవర్ల సుప్రభాత సేవా అనంతరం ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులకు ఉచిత దర్శన ప్రవేశము అనుమతించబడును.

4. ప్రత్యేక ప్రవేశము(ఒకరికి ) : Rs. 50.00 Special Darshan  (for one person)

సమయము – ఉదయం 6.00 నుండి సాయంత్రం 9.00 వరకు
ప్రత్యేక దర్శనము ఈ సేవకు ఒకటిక్కెట్ కి ఒకరిని మాత్రమే రూ.50/-లు ప్రత్యేక క్యూలైను లో శ్రీస్వామి, అమ్మవార్ల దర్శనమునకు పంపబడును.

5. శీఘ్ర దర్శనం (ఒకరికి ) : Rs. 200.00 / Fast Darshan  (for one person)

శీఘ్ర దర్శనము సేవకు ఒక టిక్కెట్ కి ఒకరిని మాత్రమే రూ.200/- లు ప్రత్యేక క్యూలైన్లు లో శ్రీస్వామి,అమ్మవార్ల దర్శనమునకు పంపుతారు. దర్శనము అయిన తరువాత 2లడ్డులు భక్తులకు ప్రసాదముగా ఇస్తారు.

6. పాలాభిషేకం ( ఇద్దరికి ) : Rs. 100.00/  Milk Abhishekam (for two person)

సమయము – ఉదయం : 5.30గం.లకు ,6.30 గం.లకు , 10.00గం.లకు , శని , ఆది , సోమ వారము ఉదయం : 6.00 ,7.00, 10.00 గం.లకు మరియు సాయంత్రం 5.00 గంటలకు మంగళ , బుధ , గురు , శుక్రవారము , సోమవారము సాయంత్రం లేదు శుక్రవారము సాయంత్రం: 4.00 గం.లకు
ఈ పాలాభిషేకము శ్రీస్వామి,అమ్మవార్లకు 4 కాలములలో నిర్వహిస్తారు. పై తెలిపిన ప్రకారము ఈ సేవకు ఇద్దరిని మాత్రమే పంపుతారు. ఈ అభిషేకం చేయడం భక్తులకు చాలమంచిది.ఈ అభిషేకమునకు సాంప్రదాయబద్ధంగా భక్తులు( ధోతి, పంచ,చీర) దుస్తులు ధరించి అభిషేకమునకు హాజరు కావలెను. ప్రసాదాలు లేవు

7. పచ్చకర్పూరం అభిషేకం (స్వామి వారికి మాత్రమే ) ( ఇద్దరికి ) :  Rs. 100.00/  Pachai Karpooram  Abhishekam (for two person)

సమయము – ఉదయం : 5.30గం.లకు ,6.30 గం.లకు , 10.00గం.లకు , శని , ఆది , సోమ వారము ఉదయం : 6.00 ,7.00 & 10.00 గం.లకు మంగళ , బుధ , గురు , శుక్రవారము , సోమవారము సాయంత్రం లేదు
సాయంత్రం: 4.00 గం.లకు శుక్ర వారము
ఈ పచ్చకర్పూరం అభిషేకం 4 కాలములలో శ్రీస్వామి వారికి మాత్రమే నిర్వహిస్తారు.

ఈ సేవకు ఇద్దరిని మాత్రమే పంపుతారు. ఈ సేవకు భక్తులకు తీర్ధము బాటిల్ ఇస్తారు. ఈ అభిషేకమునకు సాంప్రదాయబద్ధంగా భక్తులు( ధోతి, పంచ,చీర) దుస్తులు ధరించి అభిషేకమునకు హాజరు కావలెను.

8. రుద్రాభిషేకం (స్వామి,అమ్మవారు ) ( ఇద్దరికి ) : Rs. 600.00/ Rudrabhishekam (for two person)

సమయము – ఉదయం : 5.30గం.లకు ,6.30 గం.లకు , 10.00గం.లకు మరియు సాయంత్రం 5.00 గంటలకు , శని , ఆది , సోమ వారము ఉదయం : 6.00 ,7.00,10.00 గం.లకు మరియు సాయంత్రం 5.00 గంటలకు మంగళ , బుధ , గురు , శుక్రవారము , సోమవారము సాయంత్రం లేదు
శుక్ర వారము సాయంత్రం: 4.00 గం.లకు
ఈ రుద్రాభిషేకం శ్రీస్వామి, అమ్మవార్లకు 4 కాలములలో నిర్వహిస్తారు. ఈ సేవకు ఒక టిక్కెట్ కి ఇద్దరిని మాత్రమే పంపుతారు. ఈ సేవకు భక్తులకు కండువా – 1నెం., జాకెట్ -1 నెం., 4లడ్డులు,4వడలు,తీర్ధము బాటిల్ పంచామృతము, ఒక కేజి పులిహోర ఇస్తారు. ఈ అభిషేకమునకు సాంప్రదాయబద్ధంగా భక్తులు( ధోతి, పంచ,చీర) దుస్తులు ధరించి అభిషేకమునకు హాజరు కావలెను.

9. మహన్యస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ( ఇద్దరికి ): Rs. 1500.00 / Mahanyasa Purvaka Ekadasa Rudrabhishekam (Only 10 Tickets Available  per day)

సమయము : 4.00 గంటలకు సాయంత్రం మాత్రమే
ఈ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సేవ ప్రతి సోమవారం ,త్రయోదశి, మాస శివరాత్రి మరియు ఆరుద్ర నక్షత్రము, ఈ పర్వదినము నందు సాయంత్రం 4గం.ల నుండి 5గం ల వరకు మహన్యాసము పారాయణము తరువాత శ్రీస్వామి,అమ్మవార్లకు అభిషేకం నిర్వహించబడును. ఈ సేవకు ఒక టిక్కెట్ కి ఇద్దరిని మాత్రమే పంపుతారు. ఈ సేవకు భక్తులకు 4లడ్డులు, 4వడలు,కండువా -1నెం.,జాకెట్ -1నెం.,పంచామృతం, పులిహోర ఒక కేజి ప్రసాదములు ఇస్తారు. ఈ అభిషేకమునకు సాంప్రదాయబద్ధంగా భక్తులు (ధోతి,పంచ,చీర ) దుస్తులు ధరించి అభిషేకమునకు హాజరు కావలెను.

10. శ్రీ శనీశ్వర అభిషేకం ( ఇద్దరికి ) : Rs. 150.00/ Sri Sanieshwara Abhishekam (for two person)

సమయము: ఉదయం 10.00 లకు, మరియు సాయంత్రం 5.00 గంటలకు
ఈ శనేశ్వర అభిషేకం శనేశ్చరుడుకి మాత్రమే నిర్వహిస్తారు. ఈ అభిషేకం ఉదయం
మరియు సాయంత్రం మాత్రమే నిర్వహిస్తారు. ఈ సేవకు భక్తులకు నువ్వుల అన్నము మాత్రమే ఇస్తారు. ఈ సేవ చేయడం వలన నవగ్రహ దోషాలు , ఏల్నాటి శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం తోలుగుతాయి. ఈ అభిషేకమునకు సాంప్రదాయబద్ధంగా భక్తులు (ధోతి, పంచ,చీర) దుస్తులు ధరించి అభిషేకమునకు హాజరు కావలెను. శనివారము త్రయోదశి వున్న రోజున ఉదయం 6.00గం.లకు నుండి 1.00P.M. వరకు మరియు 5.00P.M.నుండి 7.00P.M.వరకు అభిషేకము నిర్వహించబడును.

11. పంచామృతాభిషేకం( ఇద్దరికి ) : Rs. 300.00 / Panchamrutha Abhishekam (for two person)

సమయము – ఉదయం : 5.30గం.లకు,6.30గం.లకు, 10.00గం.లకు మరియు సాయంత్రం 5.00 గంటలకు ,
శని,ఆది,సోమ వారము ఉదయం : 6.00,7. 10.00 గం.లకు 10.00గం.లకు మరియు సాయంత్రం 5.00 గంటలకు , మంగళ,బుధ,గురు,శుక్రవారము, సోమవారము సాయంత్రం లేదు శుక్ర వారముసాయంత్రం: 4.00 గం.లకు
ఈ పంచామృతాభిషేకం శ్రీస్వామి ,అమ్మవార్లకు 4 కాలములలో నిర్వహిస్తారు. ఈ సేవకు ఇద్దరిని మాత్రమే పంపుతారు. ఈ సేవకు భక్తులకు పంచామృతం మరియు పులిహోర – 1కేజి ,2 లడ్డులు, 2 వడలు ప్రసాదము ఇస్తారు. ఈ అభిషేకమునకు సాంప్రదాయబద్ధంగా భక్తులు( ధోతి, పంచ,చీర) దుస్తులు ధరించి అభిషేకమునకు హాజరు కావలెను.

12. అష్టోత్తర అర్చన (ఒకరికి) : Rs. 25.00/ Astotra Abhishekam (for one person)

సమయము – ఉదయం : 6.00 గంటల నుండి సాయంత్రం 8.00 గంటల వరకు
ఈ అష్టోత్తర అర్చన శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నిర్వహిస్తారు.

13. త్రిశతి అర్చన (ఇద్దరికి): Rs 400.00/ Trishati Archana (for two person)

సమయం – ఉదయం:10.00 గంటలకు మరియు సాయంత్రం 5.00 గంటలకు
శ్రీ జ్ణానప్రసూనాంబా అమ్మవారికి మాత్రమే త్రిశతి అర్చన చేస్తారు. 3 వ కాలము అభిషేకము సమయoలో చేస్తారు. ఈ టిక్కెట్ కి ఇద్దరు మాత్రమే పంపుతారు ఈ అర్చన చేయడం వలన ఉద్యోగ, వ్యాపారరీత్యా,పిల్లల చదువుకి మంచిది. ఈ అర్చన సేవకు 2 లడ్డులు, 2 వడలు,మరియు పులిహోర -1కేజి భక్తులకు ప్రసాదం ఇస్తారు.

14. సహస్రనామార్చన (స్వామి,అమ్మవారికి మాత్రమే ) (ఇద్దరికి): Rs – 400.00/ Sahasranama Archana (for two person)

సమయం – ఉదయం:10.00 గంటలకు మరియు సాయంత్రం 5.00 గంటలకు ఈ అర్చన స్వామికి మరియు అమ్మవారికి 3 వ కాలములో మరియు సాయంత్రం
4వ కాలములో అర్చన చేస్తారు. శ్రీస్వామి,అమ్మవారికి 3వ కాలము అభిషేకము,4 వ కాలము అభిషేకము అయిన తరువాత అర్చన చేసి మహానైవేధ్యం పెట్టుట ఆనవాయితీగా వున్నది. ఈ సేవకు 16 వడలు, పులిహోర -1కేజి ప్రసాదములు ఇస్తారు.

15. స్వర్ణ పుష్పార్చన ( ప్రతి శుక్రవారము ) ( ఇద్దరికి): Rs 1000.00/ Swarna Pushpa Archana (for two person)

సమయం – సాయంత్రం 5.00 గంటలకు
ఈ స్వర్ణపుష్పార్చన ప్రతి శుక్రవారము సాయంత్రం అమ్మవారికి అభిషేకము అయిన తరువాత 108 బంగారు తామర పుష్పాలతో సాయంత్రం 5 గం.లకు అమ్మవారి గర్భాలయం నందు నిర్వహించబడును. ఈ పూజకు ప్రసాదము ఒక లడ్డు, ఒక వడ ఇస్తారు.

16. రుద్రహోమం ( ఇద్దరికి) : Rs 1116.00/ Rudra Homam (for two person)

సమయం – ఉదయం: 10.00 నుండి 11.30 లోపు
ఈ రుద్రహోమం దేవాలయ ప్రాంగణం గల కాళికా అమ్మవారి ఆలయము నందు నిర్వహించబడును. ఈ సేవ ఉదయం 10.00 గం.ల నుండి 11.30 ని.ల వరకు నిర్వహించబడును. ఈ సేవకు భక్తులకు 5 లడ్డులు, 5వడలు, కండువా – 1నెం.,జాకెట్ – 1నెం. పులిహోర ఒక కేజి ప్రసాదములు ఇవ్వబడును. ఈ టిక్కెట్ కి ఇద్దరినే పంపుతారు. పూజకు కావలసిన సామాన్లు అన్ని దేవస్థానము ఇస్తుంది. తర్వాత స్వామి,అమ్మవార్ల దర్శనమునకు అనుమతించబడుతుంది.

17. చండీ హోమం ( ఇద్దరికి) : Rs 1116.00/ Chandi Homam (for two person)

సమయం – ఉదయం: 10.00 గంటల నుండి 11.30 గంటల లోపు
ఈ చండీహోమం దేవాలయ ప్రాంగణం నందు గల కాళికా అమ్మవారి ఆలయము నందు నిర్వహించబడును. ఈ సేవకు భక్తులకు 5 లడ్డులు, 5 వడలు,కండువా -1 నెం.,
జాకెట్ – 1నెం. పులిహోర ఒక కేజి ప్రసాదములు ఇవ్వబడును. ఈ టిక్కెట్ కి ఇద్దరినే పంపుతారు. పూజకు కావలసిన సామాన్లు అన్ని దేవస్థానము ఇస్తుంది. ప్రత్యేక దర్శనం” క్యూ “ ద్వార స్వామి,అమ్మవార్ల దర్శనమునకు అనుమతించబడుతుంది.

Rahu-Ketu Pooja

18. నిత్యకళ్యాణం (ఇద్దరికి) : Rs 501.00, 10 టిక్కెట్లు రోజుకి  / Nithya Kalyanam (for two person)

సమయం – ఉదయం 11.00 గంటల నుండి 12.00 గంటల లోపు
ఈ నిత్యకళ్యాణం శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నిర్వహిస్తారు. ఈ నిత్యకళ్యాణం ఉదయం. 11గం. ల నుండి 12 గం.ల మధ్యలో నిర్వహిస్తారు. ఈ సేవకు భక్తులకు 5లడ్డులు,5వడలు,కండువా -1నెం.,జాకెట్-1నెం.,పులిహోర -1కేజి ప్రసాదములు ఇస్తారు. ప్రత్యేక దర్శనం “క్యూ” ద్వార స్వామి,అమ్మవార్ల దర్శనమునకు అనుమతించెను.

19. శ్రీ అమ్మవారి ఊOజల సేవ ( ప్రతి శుక్రవారము ) (ఒకరికి) : Rs 58.00/ Sri Ammavari  Unjal Seva (for one person)

సమయం – సాయంత్రం 6.00 గంటల నుండి 7.30 గంటలకు
ఈ ఊoజలసేవ అమ్మవారికి మాత్రమే ప్రతి శుక్రవారం సాయంత్రం 6గం.లనుండి 7.30ని.ల వరకు నిర్వహిస్తారు. శ్రీ అమ్మవారి సన్నిధి ఎదురుగా నిర్వహిస్తారు.

20. ప్రదోష నంది సేవ (త్రయోదశి రోజున ప్రదోషO) (ఒకరికి) : Rs 120.00/ Pradosham Nandi Seva

సమయం – సాయంత్రం 6.00 గంటలకు
ఈ ప్రదోష నందిసేవ ప్రతి త్రయోదశి నందు శ్రీస్వామి వారి గర్భాలయామునకు ఎదురుగా వున్న నందికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ నంది సేవకు టిక్కెట్ కి ఒకరిని మాత్రమే పంపుతారు

21. రాహుకేతు పూజ (ఇద్దరికి) : Rs 300.00/ Rahu Ketu Pooja (for two person)

సమయము – ఉదయం :6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
ఇది నాలుగు ప్రదేశాలలో చేస్తారు ఒక్క శివరాత్రి రోజు మిగతా అన్ని రోజులలో ఈ పూజ నిర్వహిస్తారు. రూ.300/- ల రాహుకేతు పూజలు ఈ దేవస్థాన ప్రాంగణము నందు గల శ్రీకృష్ణదేవరాయ మందపము నందు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం
6గం.ల వరకు ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున నిర్వహిచబడును. ఈ సేవకు ఒక టిక్కెట్ కి ఇద్దరిని మాత్రమే(ఒక జత) లేనిచో ఒక్కరు (పెళ్ళి కానీ వారు మాత్రమే) అనుమతించబడును. ఈ పూజకు కావలసిన సామగ్రి మెత్తము అనగా వెండి నాగపడిగలు ( చిన్నవి-2), మరియు పూజాసామగ్రి దేవస్థానము వారే ఇస్తారు. ఈ పూజలు జరిపించుకొన్న భక్తులకు సకల దోషములు నివృత్తి అగును.

22. రాహుకేతు పూజ (ఇద్దరికి) : Rs 750.00/ Rahu Ketu Puja (for two person)

సమయము – ఉదయం :6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
రూ.750/-ల రాహుకేతు పూజలు ఈ దేవస్థాన ప్రాంగణము నందు గల నగిరి కుమారుల మండపము నందు ఉదయం 6గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకు ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున నిర్వహించబడును. ఈ సేవకు ఒక టిక్కెట్ కు ఇద్దరిని మాత్రమే అనుమతించబడును. (ఒక జత) లేనిచో ఒక్కరు (పెళ్ళి కానీ వారు మాత్రమే) ఈ పూజకు కావలసిన సామగ్రి మెత్తము అనగా వెండి నాగపడిగలు (పెద్దవి-2), మరియు పూజాసామగ్రి దేవస్థానము వారే ఇచ్చేదరు. ఈ పూజలు జరిపించుకొన్న భక్తులకు సకల దోషములు నివృత్తి అగును.

23. రాహు కేతు పూజ (ఆలయం లోపల ) (ఇద్దరికి) : Rs 1500.00/ Rahu Ketu Pooja (Inside Temple, for two person)

సమయము – ఉదయం :6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
రూ.1500/-ల రాహుకేతు పూజలు ఆలయం లోపల భాగము నందు ఉదయం 6గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకు ప్రతి రెండు గంటలకు ఒక్కొక్క బ్యాచ్ చొప్పున నిర్వహించబడును. ఈ సేవకు ఒక టిక్కెట్ కు ఇద్దరిని మాత్రమే అనుమతించబడును. (ఒక జత) లేనిచో ఒక్కరు (పెళ్ళి కానీ వారు మాత్రమే) . ఈ పూజకు కావలసిన సామగ్రి మెత్తము అనగా వెండి నాగపడిగలు (పెద్దవి-2), మరియు పూజాసామగ్రి దేవస్థానము వారే ఇచ్చేదరు. ఈ పూజలు జరిపించుకొన్న భక్తులకు సకల దోషములు నివృత్తి అగును.

24. రాహు కేతు పూజ (ఆలయం లోపల ) (ఇద్దరికి) : Rs 2500.00/ Rahu Ketu Puja (Inside Temple, for two person)

సమయము – ఉదయం :6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
రూ.2500/-ల రాహుకేతు పూజలు ఆలయం లోపల శ్రీ స్వామి వారి సన్నిధి ప్రక్కన గల సహస్రనామ లింగము వద్ద నిర్వహించబడును. ఉదయం 6గం.ల నుండి
సాయంత్రం 6 గం.ల వరకు నిర్వహించబడును. ఈ సేవకు ఒక టిక్కెట్ కు ఇద్దరిని మాత్రమే అనుమతించబడును. ఈ పూజకు కావలసిన సామగ్రి మెత్తము అనగా వెండి నాగపడిగలు (పెద్దది-1; చిన్నది-1), మరియు పూజాసామగ్రి దేవస్థానము వారే ఇచ్చేదరు. ఈ పూజలు జరిపించుకొన్న భక్తులకు సకల దోషములు నివృత్తి అగును.

25. అఖండ దీపారాధన దర్శనం (ఒకరికి): Rs 200.00/ Akhanda Deeparadhana Darshanam (for one person)

సమయం – సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటలకు
ఈ అఖండదీపారాధన దర్శనం ప్రతి దినము సాయంత్రం శ్రీస్వామి, అమ్మవార్ల అభిషేకానంతరం నైవేధ్యం తరువాత శ్రీస్వామి, అమ్మవార్లకు ఈ అఖండ దీపారాధన నిర్వహించబడును. ఈ సేవకు ఒక టిక్కెట్ కి ఒకరిని మాత్రమే పంపుతారు. ప్రదోష నంది సేవ రోజు మరియు బ్రహ్మోత్సవముల రోజులలో నిలుపుదల చేయడమైనది.

26. వాహనపూజ (పెద్దవి ) : Rs 100.00/-(చిన్నవి) : Rs 20.00/ Vehicle Pooja (Four Wheelers)

సమయము – ఉదయం : 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
ఈ వాహన పూజలు నూతన వాహనం కొన్నవారు వచ్చి ఆలయ ప్రాంగణమున సుపధ మండపము
(దక్షిణ గోపురం)వద్ద వాహన పూజ చేసుకొనబడును.

Kalahsti Temple Address:
Sri Kalahasteeswara Swami Vari Devasthanam,
Srikalahasti,
Chittoor District,
Andhra Pradesh.

Inquiry: 08578 222240
P.R.O:08578 221655
Fax:08578 221336
A.E.O:08578 223303
Ex.Engineer:08578 221610
Accountant:08578 221005

Sevas at Sri Kalahasteeswara Swamy Temple, Price Details, Pooja, Address

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top