Templesinindiainfo

Best Spiritual Website

Vemana Satakam Lyrics in Telugu | Vemana Padyalu

Vemana Satakam was Written by yogi vemana.

Vemana Satakam Lyrics in Telugu:

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడనతకు తత్వమగును
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ! || 1 ||

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడలవేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
విశ్వదాభిరామ వినుర వేమ! || 2 ||

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
మెంత చేసే ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
విశ్వదాభిరామ వినుర వేమ! || 3 ||

టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు
లోకమందు జెప్పి మంచు
కాకులట్టి జనుల కానరీ మర్మము
విశ్వదాభిరామ వినుర వేమ! || 4 ||

ఙ్ఞానమెన్న గురువు ఙ్ఞానహైన్యము బుద్ధి
రెంటినందు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినుర వేమ! || 5 ||

జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినుర వేమ! || 6 ||

జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములందు నెండ జగములుండు
నరుడు జగమునంట నడుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ! || 7 ||

ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు
లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టునిట్టు దాటనది పోవునిది రామ
విశ్వదాభిరామ వినుర వేమ! || 8 ||

నరుడెయైన లేక నారాయణుండైన
తత్త్వబద్ధుడైన దరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామ వినుర వేమ! || 9 ||

ద్వారంబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినుర వేమ! || 10 ||

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి
మిత్రచంద్ర శిఖులు నేత్రచయము
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ! || 11 ||

యోగిననుచు గొంత యోగముగూర్చక
జగమునెల్లబట్ట చంపి తినుచు
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన
యోగికాడు వాడె యోగు వేమ! || 12 ||

అర్ధ యంకణమున కాధారమైనట్టి
యొంటిమేడ గుంజు నొనరనిల్పె
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు
విశ్వదాభిరామ వినుర వేమ! || 13 ||

అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా
విశ్వదాభిరామ వినుర వేమ! || 14 ||

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ! || 15 ||

పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె పరము నిహము
పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన
విశ్వదాభిరామ వినుర వేమ! || 16 ||

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
నొనర శివుని జూడ నుపమ గలదు
మనసు చదరనీక మహిలోన జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ! || 17 ||

తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమ! || 18 ||

జాలినొందరాదు జవదాటి కనరాదు
అది మూలమైన ఆత్మమఱుగు
పోరిచేరి పొంది పూర్ణము నందురా
విశ్వదాభిరామ వినుర వేమ! || 19 ||

జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినుర వేమ! || 20 ||

నీవనినను నేననినను
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
భావంబు దెలిసి మదిని
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమ! || 21 ||

నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినుర వేమ! || 22 ||

పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ వర్ణములను ప్రబలె జగము
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
విశ్వదాభిరామ వినుర వేమ! || 23 ||

నేయి వెన్న కాచి నీడనే యుంచిన
బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినుర వేమ! || 24 ||

మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినుర వేమ! || 25 ||

మంట లోహమందు మ్రాకుల శిలలందు
పటములందు గోడప్రతిమలందు
తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ! || 26 ||

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగు వేమ! || 27 ||

ధూమాదుల నావృతమై
వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
శ్రీమించు శివుని జేరును
గామాదుల గలియడతడు ఘనముగ వేమ! || 28 ||

పగలుడుగ నాసలుడుగును
వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్
తగులుడుగు భోగముడిగిన
త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమ! || 29 ||

పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లఙ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ! || 30 ||

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమ! || 31 ||

పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరుల విత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినుర వేమ! || 32 ||

పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమంతలేక జారడగును
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు
విశ్వదాభిరామ వినుర వేమ! || 33 ||

నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
వ్రాతకన్న సాక్షి వలవదన్న
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ! || 34 ||

నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ! || 35 ||

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ! || 36 ||

తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ! || 37 ||

తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్‍దమది
విశ్వదాభిరామ వినుర వేమ! || 38 ||

తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
పార్వతీభవు లిలబరమగురులు
కూలివాండ్ర జగతి గురులన ద్రోహము
విశ్వదాభిరామ వినుర వేమ! || 39 ||

తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ! || 40 ||

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమ! || 41 ||

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
బుట్టిరేమి వారు గిట్టరేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!
విశ్వదాభిరామ వినుర వేమ! || 42 ||

లోకమందుబుట్టి లోకమందె పెరిగి
లోక విభవమోర్వలేక జనుడు
లోకమందు జనికి లోబడి చెడిపోవును
విశ్వదాభిరామ వినుర వేమ! || 43 ||

మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్సినంత మహితుడగును
మనసులేని పూజ మట్టి సమానము
విశ్వదాభిరామ వినుర వేమ! || 44 ||

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమ! || 45 ||

మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే?
విశ్వదాభిరామ వినుర వేమ! || 46 ||

మనసే మాయా మృగమౌ
మననేమిటి పైకిగానీ మణిపోనీకా
మనసున మనసును జంపిన
మనందే ముక్తిగలదు మహిలో వేమ! || 47 ||

మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకుగరుణచెందినదని
వేదపఠన చేసి వెఱ్ఱులై పోదురు,
విశ్వదాభిరామ వినుర వేమ! || 48 ||

మఠములోనియోగి మాయలన్నియుగోసి
ఘటములోన నున్న ఘనునిదెలిసి
మాట మాటకుగురు మరువక తెలుపురా,
విశ్వదాభిరామ వినుర వేమ! || 49 ||

తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
వెంట దేరు ధనము వంటబోరు
తొనెటకు జనునొ ధనమెందు బోవునో
విశ్వదాభిరామ వినుర వేమ! || 50 ||

ఆశయనెడు దాని గోసివేయగాలేక
మొహబుద్ది వలన మునుగువారు
కాశివాసులైన గనబోరు మోక్షము
విశ్వదాభిరామ వినుర వేమ! || 51 ||

చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే
ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప
గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా
విశ్వదాభిరామ వినుర వేమ! || 52 ||

భోగంబుల కాశింపక
రాగద్వేషంబు రంగుడదమలో
వేగమె మోక్ష పదంబును
రాగను నాతండు యోగిరాయుడు వేమ! || 53 ||

చనువారెల్లను జనులం
జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్
వినవలె గనవలె మనవలె
నని మషులకు దెలుసగూడ దంత్యము వేమ! || 54 ||

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
కట్టుపడుచు ముక్తిగానరైరి
ఙ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ! || 55 ||

అతిథి రాక చూచి యదలించి పడవైచి
కఠిన చితులగుచు గానలేరు
కర్మమునకు ముందు ధర్మము గానరో
విశ్వదాభిరామ వినుర వేమ! || 56 ||

తను వలచిన దావలచును తను
వలవక యున్ననెనడు తావలవ డిలన్
తనదు పటాటోపంబులు తన
మాయలు పనికిరావు ధరలోన వేమ! || 57 ||

మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినుర వేమ! || 58 ||

తనకేనాడు సుభిక్షము
తనకేనాడును భగంబు తనరవయునం
చును తన దశకై యెల్లెడ
మనసందున జివుకుచుండు మహిలో వేమ! || 59 ||

ఎండిన మా నొకటడవిని
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదుపును వేమ! || 60 ||

నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
పలుకవలయుగాని పరులకొరకు
చావకూడ దింక నోపదవ్యం పల్క
విశ్వదాభిరామ వినుర వేమ! || 61 ||

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమ! || 62 ||

వినియు వినకయుండు కనియు గనక యుండు
తలచి తలపకుండు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
విశ్వదాభిరామ వినుర వేమ! || 63 ||

వెన్న చేతబట్టి వివరంబు తెలియక
ఘృతము కోరునట్టి యతని భండి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినుర వేమ! || 64 ||

రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూప క్రియల్
విశ్వదాభిరామ వినుర వేమ! || 65 ||

లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొండగుచుండు
విశ్వదాభిరామ వినుర వేమ! || 66 ||

శాంతమే జనులను జయమునొందించును
శాంతముననె గురువు జాడ తెలియు
శాంత భావ మహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినుర వేమ! || 67 ||

వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినుర వేమ! || 68 ||

ఇంగలంబు తోడ నిల సల్పుతోడను
పరుని యాలితోడ పతితుతోడ
సరసమాడుటెల్ల చావుకు మూలము
విశ్వదాభిరామ వినుర వేమ! || 69 ||

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు
దాని బలిమి నెంతయైన గూడు
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు
విశ్వదాభిరామ వినుర వేమ! || 70 ||

తామసించి చేయదగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనా?
విశ్వదాభిరామ వినుర వేమ! || 71 ||

తల్లీ బిడ్డలకు తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కానీయెల్ల యెడల ఘన దుఃఖకరమది
విశ్వదాభిరామ వినుర వేమ! || 72 ||

దొంగమాటలాడ దొరుకునె మోక్షము
చేతగాని పలుకు చేటుదెచ్చు
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
విశ్వదాభిరామ వినుర వేమ! || 73 ||

నలుగురు కల చోటను దా
దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా
దలచెడి యాతడు నిచ్చలు
గల మాటలే పలుకుచుండగా దగు వేమ! || 74 ||

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
కడుపు చల్లజేసి ఘనత విడుచు
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
విశ్వదాభిరామ వినుర వేమ! || 75 ||

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ! || 76 ||

పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు
బంగరందు కూర్ప బరువు గనును
గాని యితర లోహమైన హీనము గాదె
విశ్వదాభిరామ వినుర వేమ! || 77 ||

జన్నములను మరియు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలముకాన
రాక యుండు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినుర వేమ! || 78 ||

తప్పు పలుకు పలికి తాతోట చేసిన
కూడియున లక్ష్మీ క్రుంగిపోవు
నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా
విశ్వదాభిరామ వినుర వేమ! || 79 ||

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ! || 80 ||

నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
ఎట్లు కలగుబర మదెంతయైన
ధనము గలిగియున్న దైవంబు గలుగదు
విశ్వదాభిరామ వినుర వేమ! || 81 ||

పగయుడగు గోపముడిగిన
పగయుడుగన్‌ కోర్కెలుడుగు బరజన్మంపుం
దగులుడుగు భేదముడిగిన
త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమ! || 82 ||

పప్పులేని కూడు పరులకోసహ్యమే
యుప్పులేని వాడె యధిక బలుడు
ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా
విశ్వదాభిరామ వినుర వేమ! || 83 ||

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ! || 84 ||

పరుల దత్తమొప్పి పాలనచేసిన
నిల స్వదత్తమునకు విను మడియగు
నవని పరుల దత్త మహపరింపగ రాదు
విశ్వధాబిరామ వినుర వేమ! || 85 ||

నిజములాడు వాని నిందించు జగమెల్ల
నిజము బల్కరాదు నీచులకడ
నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినుర వేమ! || 86 ||

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ! || 87 ||

పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
వట్టి మాటలాడు వాడధముడు
అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా
విశ్వధాబిరామ వినుర వేమ! || 88 ||

భయమంతయు దేహమునకె
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే
లయమంతయు జీవునకే
జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమ! || 89 ||

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ! || 90 ||

మాటజెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వదాభిరామ వినుర వేమ! || 91 ||

మనసు తెలిసి యొకని మాటకు బ్రతిచెప్ప
సంతసించు నతడు చాలమెచ్చు
మనసు దెలియకున్నడనియుచు ననునేదో
విశ్వదాభిరామ వినుర వేమ! || 92 ||

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ! || 93 ||

ఙ్ఞానియైనవాని మానక పూజించు
మనుజుడెప్పుడు పరమునను ముదంబు
సుఖమునందుచుండుసూరులు మెచ్చగ
విశ్వదాభిరామ వినుర వేమ! || 94 ||

హాని కలుగబోదు హరిమది నెంచెడు
వాని కబ్దు పరము వసుధయందు
పూని నిష్ఠమీరి పొదలక యుండుము
విశ్వరాభిరామ వినుర వేమ! || 95 ||

అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ! || 96 ||

న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు
జ్యోతిషము జనముల నీతుల దప్పించు
విశ్వదాభిరామ వినుర వేమ! || 97 ||

దేవుడనగ వేరే దేశముందున్నాడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనములనెక్కి పడిదోలుచున్నాడు
విశ్వదాభిరామ వినుర వేమ! || 98 ||

భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ! || 99 ||

వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు
చేతకంటె హెచ్చు వ్రాత లేదు
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
విశ్వదాభిరామ వినుర వేమ! || 100 ||

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమ! || 101 ||

ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ
నంటి చూడలేక యడవులందు
నుంట మేటంచునుందురా జోగులై
విశ్వదాభిరామ వినుర వేమ! || 102 ||

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ! || 103 ||

అగ్నిబానా మేసి యంబుధి నింకించు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినుర వేమ! || 104 ||

ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు
నం దొకండు విడ్డ పొందు చెడును
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
విశ్వదాభిరామ వినుర వేమ! || 105 ||

ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె
జీవబుద్ధి వలన జీవుడయ్యె
మోహబుద్ధిలయము ముందర గనుగొను
విశ్వదాభిరామ వినుర వేమ! || 106 ||

గుణములోగలవాని కులమెంచగానేల
గుణము కలిగెనేని కోటిసేయు
గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు
విశ్వదాభిరామ వినుర వేమ! || 107 ||

తల్లితండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ! || 108 ||

కోపమున ఘనత కొంచెమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ! || 109 ||

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా
నలుపు నలుపేకాని తెలుపుకాదు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె
విశ్వదాభిరామ వినుర వేమ! || 110 ||

అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ! || 111 ||

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు
విశ్వదాభిరామ వినుర వేమ! || 112 ||

తుమ్మచెట్టు ముండ్ల తోడనేపుట్టును
విత్తులొననుండు వెడలునట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టను
విశ్వదాభిరామ వినుర వేమ! || 113 ||

కపటి వేషమూని కడగండ్లు పడనేల
విపిన భూమి తిరిగి విసుగనేల
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
విశ్వదాభి రామ వినుర వేమ || 114 ||

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినుర వేమ! || 115 ||

మనసులోనున్న మర్మమంత ఎరిగి
స్థిరము చేసి ఆత్మ తేటపరిచి
ఘటము నిల్పవలయు, ఘనతలింకేటికి
విశ్వదాభి రామవినుర వేమ! || 116 ||

కదలనీయకుండ గట్టిగా లింగంబు
కట్టివేయనేమి ఘనత కలుగు
భావమందు శివుని భావించి కానరా
విశ్వదాభిరామ వినుర వేమ! || 117 ||

మేక జంకబెట్టిమెలగుచు మందలో
బ్రమని తిరుగు గొల్ల పగిదిగాను
దేవునెరుగక పరదవేతల దలచు
విశ్వదాభిరామ వినుర వేమ! || 118 ||

తన కుల గోత్రము లాకృతి
తన సంపద కలిమి బలిమి తనకేలనయా?
తన వెంటరావు నిజమిది
తన సత్యమే తోడువచ్చు తనతో
విశ్వదాభిరామ వినుర వేమ! || 119 ||

కలిమిగల్గనేమి కరుణ లేకుండిన
కలిమి తగునె దుష్టకర్ములకును
తేనెగూర్పనీగ తెరువున బోవదా
విశ్వదాభిరామ వినుర వేమ! || 120 ||

ఎండిన మానొకటడవిని
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదువును వేమ! || 121 ||

కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు
ఉభయులరయుగూడి యుండినట్లు
పేద పేద గూడి పెనగొని యుండును
విశ్వదాభిరామా వినుర వేమ! || 122 ||

మాటలాడు గల్గు మర్మములెరిగిన
పిన్నపెద్దతనము లెన్నవలదు
పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా?
విశ్వధాభిరామ వినుర వేమ! || 123 ||

కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
మొండి వాని హితుడు బండవాడు
దుండగీడునకును కొండెడు దళవాయి
విశ్వదాభిరామా వినుర వేమ! || 124 ||

ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీటనుండనేని నిక్కిపడును
అండతొలుగు నెడల నందర పని అట్లే
విశ్వదాభి రామ వినుర వేమ! || 125 ||

తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
జాలిపడెడు వాడు జడుడు సుమ్మి
తారతమ్య మెరుగనేరని పశువది
విశ్వదాభిరామ వినుర వేమ! || 126 ||

పరులమేలు చూసి పలుకాకి వలె
వట్టిమాటలాడు వాడు అధముడు
అట్టివాని బతుకుటది ఏల మంటికా?
విశ్వదాభిరామ వినుర వేమ! || 127 ||

గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ! || 128 ||

చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్కయైనా బాధసేయు
బలిమిలేని వేళ పంతములు చెల్లవు
విశ్వదాభిరామ వినుర వేమ! || 129 ||

పనసతొనలకన్న పంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్న
చెఱుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ వినుర వేమ! || 130 ||

నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినుర వేమ! || 131 ||

ఉప్పులేనికూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేనివాడె యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినుర వేమ! || 132 ||

పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ! || 133 ||

చంపదగిన శతృవు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినుర వేమ! || 134 ||

ఆపదగల వేళ అరసి బంధువు జూడు
భయము వేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణము
విశ్వదాభిరామ వినుర వేమ! || 135 ||

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినుర వేమ! || 136 ||

ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాండశుద్ది లేని పాక మేల
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినుర వేమ! || 137 ||

యినుము విరగనేని యినుమూరు ముమ్మారు
కాచియెతకవచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి చేర్చరాదయా
విశ్వదాభిరామ వినుర వేమ! || 138 ||

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వదాభిరామ వినుర వేమ! || 139 ||

అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ! || 140 ||

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ! || 141 ||

తప్పు లెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ! || 142 ||

మిరప గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి జూడలోన జురుకుమనును
సజ్జను లగు వారి సార మిట్లుండు
విశ్వదాభిరామ వినుర వేమ! || 143 ||

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ! || 144 ||

వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినుర వేమ! || 145 ||

వేషభాష లెరిగి కాషయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులృన తలపులూ బోడూలా
విశ్వదాభిరామ వినుర వేమ! || 146 ||

Also Read:

Vemana Satakam in Hindi | English | Bengali | Kannada | Malayalam | Telugu | Tamil

Vemana Satakam Lyrics in Telugu | Vemana Padyalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top