Templesinindiainfo

Best Spiritual Website

Jonnawada Temple History in Telugu

Jonnawada Sri Kamakshi Ammavari Temple Timings:

Morning: 5.00 AM to 1.00 PM
Evening: 4.30 PM to 9.15 PM

Jonnawada Temple History in Telugu

బ్రహ్మాండాది పురాణములలో ప్రసంసింపబడిన పవన పినాకిని నదీ తీరమున వెలసియున్న దివ్య క్షేత్రమే జొన్నవాడ అశేష ప్రజానికానికి ఆకర్షణీయమైన పెన్నకు ఉత్తర ఒడ్డున వెలుగొందుతున్న ఈ క్షేత్రము ఎన్నదగిన వాటిలో నొకటి శ్రీ కామాక్షితాయి మల్లికార్జున స్వామి వారలకు నిలయమై అలరారుతున్న ఈ జొన్నవాడ పురాతనమైన పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ పుణ్య క్షేత్రము త్రేతాయుగమున కశ్యప బ్రహ్మ యజ్ఞ మొనరించిన ప్రదేశం కావుననే యజ్ఞవాటిక జన్నవాడగా సార్ధకమైనది. వాంఛితార్ద ప్రధాయని కామాక్షితాయి ఆది శంకరులు సేవించిరని ప్రతీతి. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థాన సన్నిధి రేవు కశ్యపతీర్ధమని, అందు స్నానమాచరించిన సకల దోషములు హరించిపోవునని చెప్పబడుచున్నవి. బ్రహ్మర్షియైన కశ్యపబ్రహ్మ ఒకనాడు కర్మ భూమియగు భూలోకమునాకు వచ్చి వేదాద్రిని (నరసింహకొండ), పినకినిని దర్శించి అక్కడ ఒక యజ్ఞము చేసిన మంచిదనుకొని వేదాద్రికి, పెన్నకు ఉత్తరమునున్న భూమిని యజ్ఞవాటిక చేసుకొనెను.

యజ్ఞవాటిక యందే గార్హస్పత్యము అను అగ్నిని నిర్మించుకొనెను. దానికి తూర్పుగా పినాకిని, దక్షిణమున (తల్పగిరి యందు) అవాహనీయము అను అగ్నిని ఏర్పరుచుకొనెను. వేదాద్రియందు దక్షిణాగ్నిని నెలకొల్పెను. ఆ మూడును త్రేతగ్నులనబడును. బ్రహ్మార్పణముగా కశ్యప మహర్షి యజ్ఞము పూర్తి చేసెను. త్రివిధములైన ఆ అగ్ని కుండములలో గార్హస్పత్యాగ్ని కుండము నుండి వెలువడిన తేజస్సు దశదిశల వ్యాపించినది. ఆ తేజస్సు చూచి అన్ని లోకములు స్త్రోత్రము చేయసాగినవి. ఆ స్త్రోత్రములతోపాటు ఆ తేజస్సు వెంబడి ఆ కుండము నుండియే ఈశ్వరుడు మల్లికర్జునుడను పేర ఆవిర్భవించెను. జొన్నవాడ యందు ఆ రీతిన మల్లికార్జున స్వామి అవతరించెనని చెప్పగా విని శౌనకాది మహామునులు కామాక్షి తాయి మల్లికార్జున స్వామి చేరిన విధమును తెలుపమని కోరిరి.

కైలాసమందు శివుని గానక పార్వతి అన్వేషణ ప్రారంభించి చివరకి జొన్నవాడ చేరినది. ఉద్యానవనమున వేంచేసియున్న పార్వతి జాడ తెలుసుకొని ఆద్యంతరహితుడైన శ్రీ మల్లికార్జునుడు స్వయముగా పార్వతిని చేరుకొని దేవి! ఈ యగ్నవతికని (జన్నవాడ) వదలి వెళ్ళుటకు నాకు మనసు రాకున్నది . కాబట్టి న కొరకు నీవు కూడా యిక్కడే యుండి “కామాక్షి” అను పేర ప్రసిద్ధి గాంచి భక్తులను రక్షించుచుండమని కోరెను. శివుని కోరికననుసరించి ఆనాటి నుండి పార్వతి దేవి “కామాక్షి” గా పిలవబడుచు భక్తుల కోరికలు తీర్చుచూ దయామయి అయి జన్నవాడలో అలరారుచున్నాదని అని సూతుడు వివరించెను. స్కందపురాణ ఉత్తరఖండమందు కామాక్షి విలాస ఘట్టమందు యీ వివరములన్నియు విశదమవుచున్నవి

Deities in Jonnawada Kamakshi Ammavari Temple:

1) Sri Lakshmi Ganapathi Swamy
2) Sri Mallikarjuna Swamy
3) Sri Valli Devasena Sametha Sri Subrahmanyeswara Swamy
4) Sri Kamakshi Tayee Amma
5) Sri Adi Sankara Charyulu Swamy
6) Sri Tarakeswara Swami
7) Sri Kasi Annapurneswari Ammavaru temples and Navagraha Mandapam, Addala Mandapams

Jonnavada Kamakshi Temple

How to Reach Jonnawada Kamakshi Ammavari Temple:

By Road: APSRTC buses are available from all places in Andhra Pradesh to reach Nellore city. From there, one can hire local autos to reach Jonnawada temple.

By Train: The nearest Railway Station is located at Nellore.

By Air: Tirupati Airport is 140 Kms and Chennai Meenambakkam Airport is 198 kms.

Jonnawada Ammavari Temple Address:

Sri Mallikarjuna Swamy Kamakshi Ammavari Temple,
Jonnawada,
Nellore,
Andhra Pradesh – 524305.
Office:+91- 08622-210566

Jonnawada Temple History in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top