Templesinindiainfo

Best Spiritual Website

Special and Interesting Temples in India

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.

నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:

1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు:

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,
3. మంజునాథ్.
శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే:

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే:

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.

రంగులు మారే ఆలయం:

1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు:

1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే:

1. బదరీనాథ్,
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం.

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు:

హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

12 ఏళ్లకు ఒకసారి:

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

స్వయంగా ప్రసాదం:

1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

ఒంటి స్తంభంతో:

యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే:

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు :

1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు:

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం:

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్

ఇంకా…

తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం etc

పూరీ:

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.

ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.

Special and Interesting Temples in India

2 thoughts on “Special and Interesting Temples in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top