Templesinindiainfo

Best Spiritual Website

Kamalakucha Choochuka Stotram Telugu Lyrics and Meaning

Below are the Lyrics and the meaning of the Telugu lyrics of Kamalakucha Choochuka Kunkumatho Stotram. This famous hymn is dedicated to Sri Venkateswara Stotram sung in all Sri Balaji temples.

Kamalakucha Choochuka Stotram in Telugu:

శ్రీ వేంకటేశ స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥ 1 ॥

తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥ 2 ॥

తా. ఓ దేవా! నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకును నాయకుడవు. శరణాగత వత్సలుడవు. బలమునకు నిధివి. ఓ వృషశైలాధిపా! నన్ను పాలింపుము.

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥ 3 ॥

తా. ఓ దేవా! హద్దులేనివియు, నీకును సహింప శక్యము కానివియు అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను. ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము.

అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥ 4 ॥

తా. జనసమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడు, వేంకటాచలమున నివసించు ఉదారబుద్ధి కలవాడు, వేదములచేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయు అగు వేంకటేశ్వరుని కంటె గొప్ప దైవము లేడు.

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ॥ 5 ॥

తా. మధురమైన వేణునాదము వలన పరవశత పొందిన కోట్లకొలది గోపికలచే చుట్టుకొనబడినవాడును, కోటి మన్మథుల చక్కదనము కలవాడును, గొల్లపడుచుల కందరికిని ఇష్టుడును, సుఖముల నిచ్చువాడును అగు వాసుదేవుని కంటె గొప్ప దైవము లేడు.

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥ 6 ॥

తా. ఓ రామా! రఘునాయకా! దాశరథీ! నీవు మనోహరములైన గుణములకు నిధివి, లోకమంతటికిని సాటిలేని ధనుర్ధురుడవు. ధీరుడవు. లక్ష్మికి భర్తవు. దేవుడవు. ఓ దయాసముద్రుడా! వరములొసగి నన్నుద్ధరింపుము.

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ॥ 7 ॥

తా. ఓ దేవా! నీవు సీతాదేవికి ప్రియుడవు. చంద్రునివలె చక్కని ముఖము కలవాడవు. రాక్షస రాజగు రావణుడనెడి చీకటిని పోగొట్టు సూర్యుడవు. మహనీయుడవు. ఓ రామా! నన్ను రక్షింపుము.

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥ 8 ॥

తా. చక్కని ముఖము, మంచి మనస్సు, శరీరము కలవాడును, సులభుడును, సుఖముల నిచ్చువాడును, అనుకూల సోదరులు కలవాడును అగు శ్రీ రామచంద్రుని విడచి, నేను ఒకప్పుడును, ఎట్టి స్థితిలోను వేరొక దేవుని సేవింపను.

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥ 9 ॥

తా. వేంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనేలేదు. నే నెల్లప్పుడును వేంకటేశ్వరునే స్మరించుచుందును. ఓ హరీ! వేంకటేశ్వరా! అనుగ్రహింపుము. ఓ వేంకటేశ్వరా! నాకు ప్రియమును తప్పక కలుగజేయుము.

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥ 10 ॥

తా. ప్రభుడవైన ఓ వేంకటేశ్వరా! నీ పాద పద్మములకు నమస్కరించవలెనను కోరికతో నేనెంతో దూరము నుండి వచ్చి సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు, నిత్యసేవ చేయుటవలన కలుగు ఫలములను తప్పక అనుగ్రహింపుము.

అఙ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥ 11 ॥

తా. ఓ శేషశైలవాసియగు హరీ! నేను మూఢుడనై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము.

Also Read:

Tirumala Balaji Sloka | kamala-kucha-chuchuka-kunkumato Stotram Lyrics and meaning in Telugu | Sri Venkateswara Slokam Lyrics in Hindi | English | Bengali | Gujarati | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Kamalakucha Choochuka Stotram Telugu Lyrics and Meaning

One thought on “Kamalakucha Choochuka Stotram Telugu Lyrics and Meaning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top