Muddugare in Telugu:
॥ ముద్దుగారే ॥
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు |
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ||
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము |
పంతమాడే కంసుని పాలి వజ్రము |
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస |
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము |
మితి గోవర్ధనపు గోమేధికము |
సతమై శంఖు చక్రాల సందుల వైఢూర్యము |
గతియై మమ్ముగాచే(టి) కమలాక్షుడు ||
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము |
ఏలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము |
పాలజలనిధిలోని పాయని దివ్య రత్నము |
బాలుని వలె తిరిగే పద్మనాభుడు ||
Also Read:
Muddugare Lyrics in English | Telugu
Other Keerthanas:
Muddugare Lyrics in Telugu