Templesinindiainfo

Best Spiritual Website

Shri Subrahmanya Ashtakam Lyrics in Telugu With Meaning

Lord Murugan or Subramanya is the elder son of Shiva and Parvati and hence the brother of Sri Ganesha. Sri Subramanya Ashtakam, also known as Swaminatha Karavalambam is an octet composed by Sri Adi Shankaracharya, praising Lord Subramanya. Shri Subramanya Ashtakam is recited to get rid of all present and past birth sins. The stotra is an octet composed by Sri Guru Adi Shankaracharya, praising Lord Subrahmanya. Swaminatha Ashtakam has 8 stanzas similar to Astakams and each stanza ends with a sentence Vallisa Nadha Mama Dehi Karavalambam asking Lord Murugan to extend a hand of support and save the devotee. Sri Subramanya is worshipped on Tuesday and Sunday for getting rid of Kuja – Mars dosha, Sarpa Dosha in one’s horoscope. Married couples desiring progeny generally offer prayers to Subramanya in serpent form.

Sri Subrahmanya Ashtakam (Karavalamba Stotram) in Telugu:

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ ||

అర్థం: హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

దేవాదిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ ||

అర్థం: దేవాదిదేవునిచే (శివుడిచే) ప్రశంసింపబడువాడా, దేవగణములకు అధిపతీ, దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన పద్మములవంటి పాదములు కలవాడా, దేవ ఋషి అయిన నారద మునీంద్రునిచే సంకీర్తనము చేయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్
తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ |
శ్రుత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ ||

అర్థం: నిత్యము అన్నదానము చేయువాడా, అఖిల రోగములను హరించుటలో నిమగ్నుడవైనవాడా, తద్వారా భక్తులకోరికలను తీర్చువాడా, శ్రుతులు (వేదములు), ఆగమములయందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

క్రౌంచాసురేంద్రపరిఖండన శక్తిశూల
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశధర తుండ శిఖీంద్రవాహ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౪ ||

అర్థం: అసురుల రాజును ఖండించిన శక్తిశూలం, పాశము మొదలయిన శస్త్రములతో అలంకరింపబడిన చేతులుకలిగి, శ్రీకుండలములు ధరించిన నాయకుడా, శిఖీంద్ర (నెమలి) చే మోయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

దేవాదిదేవ రథమండలమధ్యవేద్య
దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమానం
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౫ ||

అర్థం: దేవాదిదేవా, రథముల సమూహములో మధ్యలో పరివేష్టితుడవై ఉండువాడా, దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని, శూరత్వము కలిగి, సురకోటిచే ప్రశంసింపబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

హారాదిరత్నమణియుక్తకిరీటహార [*హీరాది*]
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాఽమరబృందవంద్య
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౬ ||

అర్థం: వజ్రము మొదలగు రత్నములతో, మాణిక్యములతో చేయబడిన కిరీటము, హారములు, కేయూరములు, కుండలములు మరియు కవచముతో అందముగా అలంకరింపబడి, వీర తారకుడిని జయించి, దేవతా బృందముచే వందనము చేయబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౭ ||

అర్థం: పంచాక్షరాది మంత్రములతో అభిమంత్రించిన గంగాజలములతో, పంచామృతములతో, ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులు పట్టాభిషేకము చేసిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
సిక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౮ ||

అర్థం – శ్రీకార్తికేయా, కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో, కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును, నా కళావిహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి, ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || ౯ ||

అర్థం: సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యవంతమైనది. దీనిని యే ద్విజులు పఠించెదరో వారు ముక్తిని సుబ్రహ్మణ్య ప్రసాదము వలన పొందగలరు. ఈ సుబ్రహ్మణ్యాష్టకమును ఎవరైతే ప్రొద్దున్నే లేవగానే పఠించెదరో, వారి కోటిజన్మలలో చేసిన పాపము తక్షణం నశించును.

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ |

Sri Subrahmanya Karavalamba Stotram Benefits:

  1. Subramanya Ashtakam helps one to get relieved from their Kuja Dosha / Chevvai Dosham.
  2. Those who have Kuja Dosha or Sevvai Dosham can chant Subramanya ashtakam to reduce their problems related to Marriage and Marriage Life.
  3. It helps to remove health problems of you & your family
  4. It is an armor that protects you thru out.
  5. Helps to remove your Sins.
  6. All the obstacles will vanish.
  7. For A-Z problems in day to day life, you can read this Subramanya ashtakam

Also Read:

Shri Subrahmanya Ashtakam / Karavalamba Stotram Lyrics in Sanskrit | English | Bengali | Gujarati | Punjabi  | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Subrahmanya Ashtakam Lyrics in Telugu With Meaning

One thought on “Shri Subrahmanya Ashtakam Lyrics in Telugu With Meaning

  1. Lord Subramanya ashtakam sthotram is very powerful and always helpful in tough times. Thanks for uploading.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top