Templesinindiainfo

Best Spiritual Website

Emayya Rama Lyrics in Telugu | Ramadasu Keerthana

Emayya Rama Telugu Lyrics:

పల్లవి:
ఏమయ్యరామ బ్రహ్మేంద్రాదులకునైన
నీ మాయ దెలియవశమా శ్రీరామ ఏ ॥

అను పల్లవి:
కామారివినుత గుణధామ కువలయదళ
శ్యామ ననుగన్నతండ్రి శ్రీరామ ఏ ॥

చరణము(లు):
సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవు
డతిబలుడనుచు కపులు శ్రీరామ క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు మదితెలియలేరైరి ఏ ॥

చెలికాడనుచు పాండవులు విరోధివటంచు
నలజరాసంధాదులు శ్రీరామ కలవాడవని కు
చేలుడు నెరిగిరిగాని జలజాక్షుడని నిన్ను సేవింపలేరైరి ఏ ॥

నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
వరుడవనుచు గోపసతులు శ్రీరామ కరివరద భద్రగిరి
శ్రీరామదాసనుత పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి ఏ ॥

Also Read

Sri Ramadasu Keerthanalu – Emayya Rama Lyrics in English | Telugu

Emayya Rama Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top