Holesa Telugu Lyrics:
హోలేసా… హోలేసా…
హోలేసా… హొలే హోలేసా
ఏటయ్యిందె గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుసూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ… ఉఉ…
హోలేసా… హోలేసా…
హోలేసా… హోలేసా…
ఏటయ్యిందె గోదారమ్మా
క్రిష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట
దుంకులాట (దుంకులాట)
ఎంకన్నకు పాలుదాపిన పాడావుల ఎగురులాట
(ఎగురులాట)
రామునికి సాయం జేసిన ఉడుత పిల్లల ఉరుకులాట
(ఉరుకులాట)
చెప్పకనె చెబుతున్నవి… చెప్పకనే చెబుతున్నవి
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా… హోలేసా…
హోలేసా… హోలేసా…
ఏటయ్యిందె గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుసూస్తున్నది గట్టు ఏమైనట్టు
సెట్టుకి పందిరేయాలనే పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటోణ్ణి కాపాడాలనే పిచ్చినాది
నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుసూపు
ఇన్నాళ్లకి నిజమయ్యే వివరం కనబడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టూ…
హోలేసా… హొలే హోలేసా…
హోలేసా… హోలేసా…
ఏటయ్యిందె గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతోతుంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా… హోలేసా…
హోలేసా… హొలే హోలేసా
హోలేసా… హోలేసా…
హోలేసా… హొలే హోలేసా
హోలేసా… హోలేసా…
హోలేసా… హొలే హోలేసా
Also Read:
Sri Ramadasu Movie Song – Holesa Lyrics in English | Telugu