ఏ రాశుల వారు ఎన్ని వత్తులు వెలిగించాలి దేవుడి ముందు:
దీపారాధన చేసే సమయంలో ఇన్ని వత్తులే వేయాలన్న నియమం ఏది స్పష్టంగా లేదు.
రెండు వత్తుల తగ్గకుండా తమ శక్తి మేరకు ఎన్ని వత్తుల నైనా వెలిగించుకోవచ్చు.
నిత్య దీపారాధన చేసే వాళ్ళు సాధారణంగా కుందిలో నాలుగు వత్తులను రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు.
అయితే చేసే పూజను బట్టి ఆచరించే నోమును బట్టి వత్తుల సంఖ్య మారుతూ వస్తుంది.
కింది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలనుకునే వారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలంటారు.
ఇలా ఎందుకు చెబుతారు అంటే అన్ని భారాన్ని భరించే భూమాత దీపం వేడిని భరించలేదట. అందుకే వేడి తగలకుండా రెండు ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి వెలిగిస్తారు. ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే సర్వ కార్య లలోనూ విజయం లభిస్తుందని, తూర్పు దిశగా పెడితే ఆరోగ్యమూ, మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం. నిత్య దీపారాధనలో కాకుండా ఏ గుడిలో నో ఏ నదీ ప్రవాహం దగ్గరలో విశేషం దీపారాధన చేయాలనుకున్న వారికి వారి జన్మ రాశి బట్టి ఎన్ని వత్తులు వెలిగించాలో శాస్త్రంలో సుస్పష్టంగా పేర్కొన్నారు.
* మేష, కర్కాటక, ధనుస్సు రాశులు -3 వత్తులు
* వృషభ, కన్య, కుంభ రాశులు – 4 వత్తులు
* సింహం, వృశ్చిక, మీన రాశులు – 5 వత్తులు
* తులారాశి – 6 వత్తులు
* మిధున, మకర రాశులు -7 వత్తులు