Templesinindiainfo

Best Spiritual Website

Itaramu Leruganayya Nagathi Lyrics in Telugu | Ramadasu Keerthana

Itaramu Leruganayya Nagathi Telugu Lyrics:

పల్లవి:
ఇతరము లెరుగనయ్యా నాగతి నీవే శ్రీరామయ్యా ఇ ॥

అను పల్లవి:
సతతము సీతాపతి నీవేయని మదినమ్మితి సద్గతి జెందింపుమయ్య ఇ ॥

చరణము(లు):
కోపము చేయవద్దు నా కోరిక లొసగు మీ ప్రొద్దు
తాపము చెందవద్దు నా పాపము బాపు మీ ప్రొద్దు
ప్రాపుదాపు నా ప్రాణము నీవే యీ పట్టున మీ పట్టువిడువనిక ఇ ॥

తప్పు లెన్నవద్దంటి నా తల్లితండ్రి నీవంటి
వొప్పుల కుప్పవంటి మా యప్పవు నీ వనుకొంటి
అప్పటప్పటికి తప్పక నీవే తిప్పలబెట్టక తీర్చి దిద్దుకొను ఇ ॥

నా మీదను దయరాదా రామా నా మనవిని వినరాదా రామ
వేమరు నాతో వాదా నన్ను వెరవకుమీ యనరాదా రామ
ప్రేమమీర మా భద్రాచలపురి ధాముడవై రామదాసుని యేలుమీ ఇ ॥

Itaramu Leruganayya Nagathi Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top