Templesinindiainfo

Best Spiritual Website

యోగా నృసింహ ఆలయం తిరుమల | Yoga Nrusimha Temple in Thirumala

తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించే భక్తులు మొదటి ప్రకార మండపంలో ఈశాన్య దిక్కున కొలువై వున్న శ్రీ యోగా నృసింహ మూర్తి (మూడు అడుగుల విగ్రహం) ని సంధార్శించి ధర్శించుకోవచ్చు.

శ్రీ రామానుజ ఆచార్యుల కాలం నాటికి తిరుమల ఆలయంలో యోగా నరసింహ ఆలయం లేదు. వైష్ణవులకు అన్ని అవతారాలకూ ప్రాధాన్యం సమానమే ఐనా, నరసింహ స్వామికి విశేష ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి అహోబలం 108 దివ్య తిరుపతులలో ఒకటి కావడం, నరసింహుని 32 రకాల మూర్తులలో యోగా నరసింహ మూర్తి కావడం, వైష్ణవ ఉపాసకులకు ‘నారసింహమంత్రం’ ముఖ్యం కావడంతో రామానుజ ఆచార్యులు ఆళ్వారుల స్తోత్రాలకు పాత్రుడై స్యామిపుష్కరిణికి పశ్చిమంలో పూజాదులకు నోచుకోని యోగనారసింహ (గిరిజ నృసింహ) మూర్తిని తిరుమల ప్రధాన ఆలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఈశాన్య మూలన పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠచేశారు. తరువాతి కాలంలో ఈ మూర్తికి ముఖ మండపం, అంతరాళం చుట్టూ ప్రదక్షిణమార్గాలు ఏర్పడడంతో సర్వజనులకు ఈ ఆలయం సెవ్యమానమైంది.

క్రీ.శ, 1469 లోని కందాడై రామానుజ అయ్యంగార్ వారి శాసనంలో ‘యోగనారసిరిహుల’ ప్రస్తావన ఉంది.

రామానుజుల కాలంనాడు ఈ యోగా నృసింహ స్వామికి పూజలు ఎలాటివి మరియు అవి ఏలా జరిగేవో తెలియదుగాని ప్రస్తుతం ఎల్లపుడూ నిత్యపూజలు లేకున్నా శుక్రవారంనాడు అభిషేకం, పూజాదికాలు జరుగుతున్నధి, మరియు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో నృసిరిహ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రామానుజుల కాలంనాటికి ప్రతి వైష్ణవాలయంలో ‘దివ్యప్రబంధ పారాయణం’ నియమం. ఆ కారణంవల్ల ఈనాడు కూడా యోగనారసింహ ఆలయంఃలోనూ ‘తిరుప్పల్లాండు’ ఆదిగా ప్రబరిధపారాయణరి జరుగుతున్నది.
శ్రీ రామానుజ ఆచార్యులు యోగా నృసింహ ప్రతిష్ట చేయడమే కాకుండా, తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు, అభిషేకాలు, ఉత్సవాలను క్రమబద్ధీకరించిన వ్యక్తి.

Yoga Nrusimha Temple in Thirumala in English

యోగా నృసింహ ఆలయం తిరుమల | Yoga Nrusimha Temple in Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top