preloader
Tue. Jul 14th, 2026

Amma Nanubrovave Telugu Lyrics:

చరణము(లు):
అమ్మ ననుబ్రోవవే రఘురాముని
కొమ్మ ననుగావవే అ ॥

అమ్మ నను బ్రోవవే సమ్మతితోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద అ ॥

కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమే విభునితో అ ॥

యుల్లములోన మీయుభయుల నెర నమ్మి
యెల్లవేళల వేడి వేసారితి నిపుడు అ ॥

చలముమాని భద్రశైల రామదాసు
నలసట బెట్టక యాదరణ జేసి రా ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *