Templesinindiainfo

Best Spiritual Website

Emira Rama Navallnera Lyrics in Telugu | Ramadasu Keerthana

Emira Rama Navallnera Telugu Lyrics:

పల్లవి:
ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ
ఏమిర రామ యీ కష్టము నీమహిమో నాప్రారబ్ధమో ఏ ॥

చరణము(లు):
కుండలిశయన వేదండ రక్షకా
అఖండతేజ నాయండ నుండవే ఏ ॥

పంకజలోచన శంకరనుత నా
సంకటమును మాన్పవె పొంకముతోను ఏ ॥

మందరధర నీ సుందర పదములు
ఇందిరేశ కనుగొందు జూపవే ఏ ॥

దినమొక ఏడుగ ఘనముగ గడిపితి
తనయుని మీదను దయలేదయయో ఏ ॥

సదయహృదయ నీ మృదుపదములు నా
హృదయ కమలమున వదలక నిలిపితి ఏ ॥

రామ రామ భద్రాచల సీతా
రామదాసుని ప్రేమతో నేలవే ఏ ॥

Emira Rama Navallnera Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top