Templesinindiainfo

Best Spiritual Website

Enta Pani Chesitivi Rama Lyrics in English | Ramadasu Keerthana

॥ Enta Pani Chesitivi Rama Telugu Lyrics ॥

చరణము(లు):
ఎంతపని చేసితివి రామ నిన్నేమందు
నిన్నేమందు సార్వభౌమ రామ
పంతమా నామీద పరమపావన నామ
సంతోష ముడిపితివి సకలసద్గుణధామ ఎం ॥

నిన్నె దైవంబనుచు నమ్మి రామ
తిన్నగా దుఃఖముల జిమ్మి రామ
కన్నదినమని నెమ్మి నిన్ను సేవింపగా
నన్నిట్లు నట్టేట ముంచు టెరుగకపోతి ఎం ॥

అన్నన్న మాటాడవేరా నీ
కన్నులను నను జూడవేరా రామ
చిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్న
గ్రన్న నను జూడుమాయన్న ఓ రామన్న ఎం ॥

భద్రాద్రివాసుడే మనుపు మము నిరుప
ద్రవముగ నుండుమనుచు రామ
భద్రనుత కరుణాసముద్ర యో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితి ఎం ॥

Also Read:

Sri Ramadasu Keerthanalu – Enta Pani Chesitivi Rama Lyrics in English | Telugu

Enta Pani Chesitivi Rama Lyrics in English | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top