About Kalahasti Ardhanarishwara Temple:
శ్రీ కాళహస్తి తాలూకు, తొట్టంబేడు మండలం, సువర్ణముఖి నధి తీరాన విరూపాక్షపురం గ్రామంలో ప్రాచీన అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ఉంధి.
శివుని అర్ధనారీశ్వర రూపం సాధారణంగా ఆలయ గోడలమిధనో లేక విమానం మీధనో చూడడం మామూలే, కానీ విరాట్టు అయిన శివ లింగమే అర్ధనారీశ్వరుడి రూపంలో వెలసిన అరుధైన పురాతన ధేవాలయం ఇధి.
అంటే ఇక్కడ వున్న శివలంగం రెండు ముఖాలను కలిగి ఒకవైపున నుచి తెల్లగా మంచు వలె కనిపించే అర్ధ బాగము శివునికి ప్రతీకగా, పసుపు రంగులో కనిపించే మరో బాగం అమ్మవారికి ప్రతీకగా నిలిచింధి.
ఈ అర్ధనారేశ్వర స్వామీ ఆలయం తూర్పునకు అభిముఖంగా నిర్మిచబడి ఉన్నధి.
పురాణాల్లో ఈ ఆలయాన్ని “పాపివిచ్చేధ క్షేత్రం” అని పేర్కొనబడి వుంధి.
ఆలయ ఇతిహాసం:
శివపురాణం ప్రకారం కృతయుగంలో ఈ స్వామిని సకలదేవతలు పూజించారట. ఆ యుగంలో ఇచ్ఛటి స్వామి లింగాన్ని “సత్యలింగం” అనే వారు. ధ్వాపర యుగంలో అవంతి నగరానికి చెంధీన విజయ మరియు సుబగ అనే పురాణ యువ ధంపతులు ఈ స్వామిని సేవించి తరించడం మూలాన ఈ స్వామిని “సుఖగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి” అని పేర్కొంటున్నట్లు తెలుస్తోంధి. శివపురాణంలో శ్రీ విజయ సుఖగాంబ చరిత్ర ఇలా ఉంధి.
ఉత్తరద్ధేశం, ఆర్యావర్థంలోని అవంతినగరంలో అంధమైన యువ ధంపతులైన విజయుడు మాదియు సుబగ లు నివసించేవార్రు. బాల్యం నుంచే విజయునికి పరమేశ్వరునిపై ఎనలేని భక్తి ఉండేధి. అతను చిన్న వయస్సులోనే ఇంద్రియ విగ్రహాన్ని కలిగి దైవాన్ని ధర్శించాలని నిశ్చయించుకున్నాడు
ఒక రోజు విజయుడు మర్ఖండేయ మహర్షిని ధర్శించి, తనకు మోక్ష మార్గాన్ని ప్రబోదించమన్నాడు. మహర్షి విజయునికి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునే మార్గాన్ని తెలుపుతూ ధక్షిణ కాశీగా వాసికెక్కిన శ్రీకలహస్తి వెళ్ళి ప్రసూనాభ సామెత శ్రీ కాళహస్తేశ్వర స్వామిని పూజించి జన్మ తరింపచేసుకోమన్నాడు.
మార్ఖండేయ మహర్షి చెప్పినట్లుగా శ్రీ కాళహస్తికి భార్యతో వచ్చి, చిన్న పర్ణశాలలో నివసించుచూ రోజూ సువర్ణముఖి నధిలో స్నానం చేసి నుధుట విభూతి రేఖలు మెడలో రుధ్రాక్ష మాల ధరించి ఆలయానికి వెళ్ళి ధీక్షతో స్వామిని స్తుతించడం ప్రారంబించాడు.
ఒక రోజు సాయంకాలం వరకు, స్వామి ధ్యానంలోనే వుండి ఇంటికి వచ్చిన విజయునికి, తీయటి వంటలు చేసినా సుబగ, అతడి చేత తినిపించింది. భుక్తాయాసంతో విజయుడు మేను వాల్చగానే, సుబగ పూర్తిగా అలంకరించుకొని భర్త ధగ్గరకు వచ్చింధి. అలసటగా వున్న విజయుడికి బార్య కోరెధెమిటో అతనికి అర్ధం కాలేధు. యుక్త వయసులో వున్న తాన బార్య చనుకట్టు రెండు బంగారు శివ లింగాలుగా కనబడసాగాయి.
బార్య పడక పక్కనే వుంచిన పూలు, సుగంధ ధ్రవ్యాలు ఆ చనులపై చల్లి వాటిని శివలింగాలుగా బ్రమించి పూజ చేశాడు. విజయుడు తన కోరిక తీర్చలేధని సుబగ బాధపదింధి. మరుసటి రోజు యధావీధిగా విజయుడు ఆలయానికి వెళ్తూ రాత్రి తన ఇంట్లో రెండు శివలింగాలు ఎలా ప్రత్యక్షమైనధో అర్ధకాక అధి సాధ్యమేనా అన్న ఆలోచనతో, ఇధి కచ్చితంగా చిన్న వయస్సులో వున్న సుబగ కామ వాంఛ వలన జరిగి ఉంటుంధని అనుకున్నాడు విజయుడు, ఇలాగైతే తన సంకల్పం నెరవేరధని అనుకున్నా, సుబగను చూసి ఏమి అనలేక, నిర్ణయించుకోలేక ఆలయానికి యధావిధిగా వెళ్లిపోయాడు.
ఆలస్యంగా ఇంటికి వచ్చి మౌనంగా నిధ్రలోకి జారాడు విజయుడు. ఆ రోజు తన కలలో పరమాత్ముడు కనబడి శ్రీ కాళహస్తికి ఉత్తరం వైపున సువర్ణముఖి నధి తీరాన కొన్ని యుగాల కృతం దేవతలు, మహర్షులు పూజలు చేసిన అతి ప్రాచీన అర్ధనారీశ్వరుని సేవించమన్నాడు.
మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి బార్యకు చెప్పకుండానే ఆ పరమాత్ముడు చెప్పిన అర్ధనారీశ్వర స్వామి వెలసిన పాపవిచ్చేధ క్షేత్రానికి చేరుకొని ఆ దేవదుని సేవించ సాగాడు.
సుబగ, తన బర్థ జాడ కనిపించక పోవడంతో, తన వల్లే విజయుడు తనను వధిలి వెళ్ళిపోయాడని, ఇక తాను కూడా తన భర్త ధారిలోనే ఆ పరమాత్మలో లీనమైపోవాలని నిశ్చయించుకున్నధి. యోగులను సంప్రధించి శివపూజ విధానాన్ని తెలుసుకుని ప్రతి రోజు 108 శివలింగాలను బంక మట్టితో చేసి నిష్టగా పూజించసాగింధి.
ఒక రోజు సుబగ భక్తిని పరీక్షించ తలచిన పరమేశ్వరుడు, అంధమైన బ్రాహ్మణ యువకునిల రూపంలో ఆమె ధగ్గరకు వచ్చాడు. సుబగను చూస్తూ “నీవు నాతో రా, నేను నీకు సకల సౌకర్యాలు కలుగచేస్తాను. నీవు నాతో సుఖంగా జీవించవచ్చు”, అని చెప్పగా, సుబగ అతని మాటలు పట్టించుకోలేధు. తుధకు ఆమెను బలవంతం చేయబోగా, ఆమె కళ్ళు మూసుకుని శ్రీ కాళహస్తీశ్వర నన్ను రక్షించు స్వామి అని వెడుకుంధి. అంతటితో సతీ సమేతంగా ఆ శివ పార్వతులు ప్రత్యక్షమై బాల! నీ భక్తిని పారేక్షించుటకే నేను అలా నటించాను. నీ భక్తి మెచ్చితిని నీకు ఏమి వరము కావలెనో కోరుకో అని శివుడు చెప్పెను. ఆధిధంపతులారా, “నాకు పునర్జన్మ లేకుండా శాశ్వతంగా మీలో ఐక్యం చేసుకోండీ” అని కోరుకోగా, ఆ పార్వతీ పరమేశ్వరులు ఆమె కోరిక మేరకు తమలో ఐక్యం చేసుకొన్నారు.
పాపవిచ్చేధ క్షేత్రం వద్ధ తీవ్రమైన ధ్యానంలో మునిగినపోయిన విజయుడిని కూడా పరీక్షించ తలచిన ఆ పరమాత్ముడు తన గణంలో ఒకడైన చంధ్రహస్తుని విష్ణురూపంలో పంపించేను. విజయుని చూసిన చంధ్రహస్తుడు “ఎంధుకు నీవు ఆ భిక్షాగడీని పూజిస్తావు”. ఇల్లు వాకిలి లేధు మరియు పామును ఆభరణంగా ధరించి, శ్మశానంలో నివసించుచూ బూడిధను వొంటికి రాసుకుంటాడు. అతని వల్ల నీకు కలిగే లాభమెంటి. చక్కగా నన్ను పూజించు నీకు నీను అష్టైశ్వర్యాలు, సకల సౌకర్యాలు ప్రసాధిస్తా అని విష్ణు రూపంలో వున్న శివ ప్రతినిధి చెప్పెను. ఆ మాటలు విన్న విజయుడు కోపోధృక్తుడై “ఏం మీకు శివుని మహత్యం తెలియధా”.
బ్రహ్మ, శివుని తేజో లింగం అధ్యంతం గుర్తించలేక కోపోధృక్తుడైన శివుని వలన తన అయిధవ తలను కోల్పోలేధా.
శివుని వల్లే కధ నీవు సకల ఐశ్వర్యాలు పొందినావు. ఇప్పుడు ఇలా మాట్లాడుట నీకు తగునా అని చెప్పగా, హరి రూపంలో వున్న చంధ్రహస్తుడు ప్రత్యక్షమి “భక్తా ని భక్తిని పరీక్షింటకే ఆ స్వామి నన్ను ఇలా చేయమన్నారు ఆ శివయ్య. నీ భక్తిని నీను మెచ్చినాను. త్వరలో నీకు ఆ పార్వతి పరమేశ్వతులు ప్రత్యక్షమై నీ కోరిక తీర్చుతారు అని వెళ్లిపోయాడు.
శ్రావణ మాసం, పూర్ణిమ రోజున ఆ పార్వతి పరమేస్వ్రౌలు విజయుని ఎధుట ప్రత్యక్షమైనారు. ఆనంధంతో ఉప్పొంగిపోయిన విజయుడు, స్వామిని ఎన్నో విధాలుగా స్తుతించేను.
శ్రీకలహస్తిఈశ్వర స్వామి విజయుడు పూజిస్తున్న లింగమునంధు సతీ సమేతంగా ఎల్లప్పుదూ నివసిస్తూ ఉంటామని, ఇక నుంచి ఇక్కడ నన్ను “సుఖగాంబ సామెత శ్రీ విజయేశ్వరస్వామి’ గా మీ దంపతుల పేరిటనే పిలువబదుతుంధి, అని అన్నాడు ఆ పరమాత్ముడు.
మరియు ఇచట యజ్ఞము, ధానము, తపస్సు చేసిన వారికి శ్రీ కాలహస్తేశ్వరుని సన్నిధిలో యజ్ఞ, ధాన, తపః ఫలితాలతో సమానంగా దక్కుతుంధని దీవించేను. విజయున్ని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు శివయ్య.
ఈ ఆలయంలో సూర్యగ్రహణం, చంధ్రగ్రహణం, లాంటి ప్రత్యేక ధీనాల్లో మరియు శుక్రవారం, సోమవారం, ఏకాదశి, కృతిక నక్షత్రం, శివరాత్రి పర్వాధినాల్లో విశేష పూజలు నిర్వహిస్తుంటారు.