Templesinindiainfo

Best Spiritual Website

Nisankalpam Betuvantido Gana Lyrics in Telugu | Ramadasu Keerthana

Nisankalpam Betuvantido Gana Lyrics:

పల్లవి:
నీసంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా నీ ॥

వాసి తరిగి నీ దాసజనులు భువి గాసిపడిన యాఘనమెవ్వరిదో నీ ॥

చరణము(లు):
బ్రోచిన మరివిడ జూచిన నీ కృపగాచి యుండుగాని
తోచితోచకను తొడరికరంబుల చాచి పరుల నే యాచనసేయను నీ ॥

పటుతరముగ నీ మటుమాయలకును నెటువలె నోర్తును
చటులతరంబుగ జెలగు భవాంబుధి నెటుదాటుదు నేనెవరిని దూరుదు నీ ॥

భావజరిపునుత పరమపురుష నీ భావము దెలియదుగా
దేవదేవ నీ సేవక జనులకు సేవకుడను ననుగావుము మ్రొక్కెద నీ ॥

దరిజేర్చెదవని ధైర్యముచే నీదరి జేరితిగాని
అరసి బ్రోవగదె యారడిబెట్టుట లెరుగనైతి నా దొరవనుకొంటి నీ ॥

శరణాగత రక్షణ భవసాగర తరణా రిపుహరణా
కరుణజూడు భద్రాద్రినివాసా అరమరచేయకు హరినిను నమ్మితి నీ ॥

Nisankalpam Betuvantido Gana Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top