preloader
Tue. Jul 14th, 2026

Rama Rara Sitarama Rara Telugu Lyrics:

పల్లవి:
రామ రారా సీతారామ రారా రా ॥

చరణము(లు):
రామ రారా నినుచాల రాజులందరు పిలువ వచ్చిరి
క్షేమమొసగ భద్రశైలధాముడవై వెలసిన తండ్రి రా ॥

మౌని యాగము గాచి శిలను మగువ చేసి జనకునింట
శివుని విల్లు విరచి మించి సీతను చేకొన్న స్వామి రా ॥

తపసి వేషమలవరించి తండ్రికొరకు వనమునకేగి
తపనసుతుని గాచి యుదధిదాటి రావణుని ద్రుంచిన రా ॥

లంక విభీషణుని కొసగి లలనగూడి అయోధ్యను
శంకలేక ఏలుచున్న శ్రీపతి భద్రాచల నివాసా రా ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *