Runa Vimochana Ganesha Stotram in Telugu:
॥ ఋణ విమోచన గణేశ స్తోత్రం ॥
అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |
శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |
ఇతి కర హృదయాది న్యాసః |
ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం
లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం
సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||
అర్థం: ఎరుపు వర్ణముతో, రెండు భుజములతో, పెద్ద పొట్టతో, కమలపూరేకులలో కూర్చుని, బ్రహ్మాది దేవతలచే పరిపరివిధముల సేవింపబడుచూ, సిద్ధులచేత నమస్కరింపబడుచున్న గణేశ దేవుని నేను ధ్యానము చేయుచున్నాను.
స్తోత్రం –
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౧ ||
అర్థం: సృష్టి చేయడానికి ముందుగా బ్రహ్మచే సరిగ్గా పూజచేయబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౨ ||
అర్థం: త్రిపురాసురుని వధించేముందు శంభుదేవునిచే సరిగ్గా పూజచేయబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౩ ||
అర్థం: హిరణ్యకశ్యపులను వధించుట కొరకు విష్ణువుచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౪ ||
అర్థం: మహిషాసురుని వధించునపుడు దేవీ చేత గణనాథ రూపమున గౌరవింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౫ ||
అర్థం: తారకాసురుని వధించే ముందు కుమారునిచే గౌరవింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
భాస్కరేణ గణేశోహి పూజితశ్చ విశుద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౬ ||
అర్థం: గణేశుడిగా సూర్యునిచే పూజింపబడి, సూర్యుడిని శుద్ధిచేసిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౭ ||
అర్థం: కాంతివృద్ధి కోసం చంద్రునిచే గణనాయకరూపములో పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౮ ||
అర్థం: తపస్సు రక్షింపబడుట కొరకు విశ్వామిత్రునిచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.
ఇదం ఋణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం |
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||
అర్థం: ఈ ఋణహర స్తోత్రము ఒక సంవత్సరము పాటు రోజూ ఒకసారి చదివితే తీవ్ర దరిద్రమును నశింపజేయగలదు.
దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్ |
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||
అర్థం: ఎంతటి దారుణమైన దరిద్రములైన తొలగింపబడి కుబేరునితో సమానముగా చేయగలదు. దీని తరువాత పదిహేను అక్షరములుగల మహామంత్రమును పఠించవలెను.
శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ |
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||
అర్థం: “శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్” అనే మంత్రమును శుచి భావనతో పఠనము చేయవలెను.
ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమీరితం |
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||
అర్థం: ఇరవైయొక్క సార్లు ఈ మంత్రమును పఠించవలెను. వేయి సార్లు ఆరు నెలలు పఠించినచో ఇష్టమైనవి లభించును.
బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్ |
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||
అర్థం: పదివేల సార్లు పఠించినచో జ్ఞానములో బృహస్పతి వలె, ధనములో ధనపతి వలె అగును.
లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్ |
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||
అర్థం: లక్ష సార్లు పఠించినచో సరైన కోరికలకు ఫలితములు వచ్చును. భూతములు, ప్రేతములు, పిశాచములు మంత్ర స్మరణము చేసిన మాత్రాన నశించును.
ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||
(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మచే స్ఫురింపబడి వ్రాయబడినది)
Also Read:
Runa Vimochana Ganesha Stotram Lyrics in English | Hindi | Kannada | Telugu | Tamil