Seetha Rama Swami Nenu Lyrics in Telugu | Ramadasu Keerthana

Sita Rama Swamy Ne Chesina Telugu Lyrics:

పల్లవి:
సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ ॥

ఖ్యాతిగ నీ పదపంకంజములు నే
ప్రీతిగ దలపక భేదమెంచితినా సీ ॥

చరణము(లు):
రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని సీ ॥

తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా సీ ॥

ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా సీ ॥

Also Read:

Sri Ramadasu Keerthanalu – Seeta Rama Swami Nenu Lyrics in English | Telugu

Seetha Rama Swami Nenu Lyrics in Telugu | Ramadasu Keerthana

One thought on “Seetha Rama Swami Nenu Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top