Templesinindiainfo

Best Spiritual Website

Tirumala Darshan RTC Announcement

తిరుమల దర్శనం RTC ప్రకటన:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.
ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.
తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు.
కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.Tirumala Balaji Darshan tru APSRTC

https://www.apsrtconline.in/oprs-web/

How to Book RTC & Tirumala Balaji Darshan Ticket Procedure Video:

Tirumala Darshan RTC Announcement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top