Templesinindiainfo

Best Spiritual Website

Tirumala Navaratri Brahmotsavam Schedule Starts from October 3

7న గరుడ సేవ, 8న స్వర్ణ రథోత్సవం , 10న రథోత్సవం, 11న చక్రస్నానం

గదులు, ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్‌ రద్దు

సెప్టెంబరు 27న కోయిల్‌  ఆళ్వార్‌ తిరుమంజనం

*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి  బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల సంధర్భంగా…

–  శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం చేపట్టనున్నారు.

గరుడ సేవలో లక్షలాది మంది భక్తులు వాహన సేవను దర్శించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

– బ్రహ్మోత్సవాల్లో గదులు, ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్‌ రద్దు చేశారు.

–  ఉత్సవాల్లో అదనంగా సీసీ కెమెరాలు, నిఘా భద్రతా విభాగాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు

– రోజూ 3వేల నుంచి 3500 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యి మందిని రప్పించనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి మరో 50 మంది సిబ్బంది రానున్నారు.

ఉత్సవాల్లో టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆక్టోపస్, వంటి ఇతర నిఘా సంస్థలు అనుక్షణం అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేశారు.

– కాటేజీలు, అతిథిగృహాలను ముందస్తుగానే మాస్‌ క్లీనింగ్‌ చేయనున్నారు

–  ఆలయానికి సరికొత్త శోభతో కాంతులీనేలా విద్యుత్‌ దీపాల అలంకరణ చేయనున్నారు.

– అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో సౌకర్యాలు పెంచనున్నారు

– కల్యాణవేదికలో ఫొటో ఎగ్జిబిషన్, ఫల, పుష్పప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

– వేలాదిగా తరలివచ్చే వాహనాల కోసం అదనపు పార్కింగ్‌ కేంద్రాలు, రింగ్‌రోడ్డు సదుపాయం కల్పించనున్నారు.

– హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

– సెప్టెంబరు 16న పున్నమి గరుడ సేవను బ్రహ్మోత్వవం తరహాలో నిర్వహించి లోపాలు గుర్తించనున్నారు.

Tirumala temple Gopuram

సెప్టెంబరు 27న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు / Srivari Brahmotsavam Dates

Sunday 02–10–2016 Evening Ankurarpana, Senathipathi Utsavam

Monday 03–10–2016 –ధ్వజారోహణం ( సా:6గం)  – పెద్ద శేషవాహనం

Tuesday 04–10–2016 – చిన్నశేషవాహనం   – హంసవాహనం

Wednesday 05–10–2016 – సింహవాహనం    – ముత్యపుపందిరి వాహనం

Thursday 06–10–2016 – కల్పవృక్షవాహనం –  సర్వభూపాల వాహనం

Friday 07–10–2016 – మోహినీ అవతారం–  గరుడ వాహనం

Saturday 08–10–2016 – హనుమంతవాహనం, సాయంత్రం  స్వర్ణ రథోత్సవం – గజవాహనం

Sunday 09–10–2016 – సూర్యప్రభ వాహనం–  చంద్రప్రభ వాహనం

Monday 10–10–2016 – రథోత్సవం  – అశ్వ వాహనం

Tuesday 11–10–2016 – చక్రస్నానం  –  ధ్వజ అవరోహణం

DayDateMorning EventEvening Event
Sunday02-10-2016 Ankurarpana, Senathipathi Utsavam
Monday03-10-2016DwarjarahanamPedda Sesha Vahanam
Tuesday04-10-2016Chinna Sesha VahanamHamsa Vahanam
Wednesday05-10-2016Simha VahanamMuthyapu Pandiri Vahanam
Thursday06-10-2016Kalpa Vruksha VahanamSarva Bhoopala Vahanam
Friday07-10-2016Mohini AvatharamGaruda Vahanam
Saturday08-10-2016Hanumantha VahanamGaja Vahanam
Sunday09-10-2016Surya Prabha VahanamChandra Prabha Vahanam
Monday10-10-2016RathostavamAswa Vahanam
Tuesday11-10-2016Chakra SnanamDwarjarahanam
Tirumala Navaratri Brahmotsavam Schedule Starts from October 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top