Templesinindiainfo

Best Spiritual Website

Trimulgherry Sri Surya Temple Timings, History in Telugu

The Surya Bhagawan temple, apart from Surya Bhagawan, has the four most important Hindu deities at the entrance, one can find a statue of Ganapathi carved on a rock and adjacent to the Sree Sathyanarayana Swamy devalyam and next to the Surya temple which has a background of rock, then near Ashwad vruksham is the Shiva Lingam in the open square. The following main deities in the temple facilities include Saraswathi Devalayam and Nagadevatha Alayam.

Trimulgherry Sri Surya Temple Timings:

Sunday Timings: 6:30 AM to 12:30 PM & 5:00 PM to 7:30 PM
Monday to Saturday: 7:00 AM to 11:00 AM and 5:00 PM to 7:00 PM

శ్రీ సూర్య భగవాన్ దేవాలయం సేవాశ్రమము
తిరుమలగిరి, సికింద్రాబాద్.
సృష్టి ప్రాభవానికి మూలపురుషుడు…
సమస్త లోకాలకు వెలుగురేఖ
సకల ప్రాణులకు ఆరోగ్య పధాత
ఈ విశ్వానికి ప్రత్యక్షదైవం….
శ్రీ సూర్య భగవానుడు!

త్రిమూర్త్యాత్మకుడిగా కీర్తించబడుతున్న సూర్యభగవానుడు అన్ని మతాలకు ఆరాధ్యదైవం. కాలచక్రానికి ప్రతీకగా 12 రూపాలతో 7 రోజులకు గుర్తుగా సప్తాశ్వాలతో నిర్విరామ ప్రయాణాన్ని కొనసాగించే ఆదేవదేవుడు లోకానికి వెలుగుతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాడు.

నాగరికత వర్ధిల్లిన ప్రతిచోట సూర్యుడ్ని ఆరాధించిన ఛాయలు ఉన్నాయి. ఈజిప్టు పిరమిడ్లలో కూడా సూర్యారాధనకు సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి.

ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని అనుక్షణం కాపాడుతున్న సూర్యభగవానుడు విశ్వవ్యాప్తంగా పూజలందుకుంటున్న ఆలయాలు మాత్రం అతితక్కువే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యక్షేత్రంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని తిరుమలగిరి శ్రీ సూర్యభగవాన్ దేవాలయం భక్తుల పూజలతో నిత్య ధూపదీపనైవేద్యాలతో కళకళలాడుతుంది. సువిశాల ప్రాంగణంలో ప్రకృతి సమక్షంలో ఈ ఆలయం నిర్మించబడంది. స్వయంభువుడిగా దర్శనమిచ్చిన శ్రీ సూర్యభగవానుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్యశరణ్ దాస్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించారు. సూర్యారాధకుడైన ఆయన ఇక్కడి కొండ ప్రాంతంలో 1959లో సూర్యవిగ్రహాన్ని ప్రతిష్టించారు.

దేవాలయ నిర్మాణాన్ని తన భుజస్కందాలపై వేసుకుని ఒక శక్తిగా ఆలయనిర్మాణాన్ని పూర్తిచేసారు. ఆలయం నిర్మించిన తీరు భక్తులకు విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు రాతిపై ఉండే మరకతగణపతి ఆశీస్సుల అందించి సాగనంపడం మంచి ఆధ్యాత్మిక అనుభూతి. సూర్యభగవానునితో పాటు శివాలయం, సరస్వతి ఆలయం, నాగదేవత ఆలయం, శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం మరియు అశ్వద్ద వృక్షం ఉపాలయాలుగా ఉన్నాయి.

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి మరియు సూర్యుని జననతిధి అయిన రథసప్తమి పర్వదినాన విశేష పూజలు జరుగుతాయి. 108 ప్రదక్షిణలు, 12 వారాలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సూర్యుడు 12 రూపాలలో భక్తులకు దర్శనమిస్తుండటం వలన 12 ఆదివారాలు ఈ ప్రదక్షిణలు చేస్తుంటారు.

Sri Surya Devalayam Trimulgherry

మానవ జీవితంలో వెలుగు చీకటి ఒకదానికొకటి అనుసరించే ఉంటాయి. కాలచక్ర గమనాన్ని నిర్దేశించే సూర్యుడు మనకందిస్తున్న నిత్యమిదే. సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో విశేష సేవలందిస్తున్న ఈ తిరుమలగిరి సూర్యభగవాన్ దేవాలయమును మరింత అభివృద్ధి పరిచేందుకు ఆలయ నిర్వాహకులు, వంశపారంపర్య ధర్మకర్త శ్రీ శివశంకర్ గారు కృషిచేస్తున్నారు.

Trimulgherry Sri Surya Temple Address:

Ward No 7 Secunderabad,
Aruna Enclave,
Trimulgherry,
Secunderabad,
Telangana 500015.

Mail id : srisurya.devalayam@Gmail.com
Contact Number : +91- 8500542325

Trimulgherry Sri Surya Temple Timings, History in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top