ఆశీర్వదించేప్పుడు అక్షింతలు ఎందుకు చల్లుతారు:
బారసాల, అన్నప్రాసన, పెళ్లి, పేరంటం……. ఇలా హైందవ సంప్రదాయంలో జరిగే ప్రతి శుభకార్యం లోనూ తలమీద అక్షింతలు వేసి ఆశీర్వదించండ పరిపాటి. మన సంస్కృతిలో ఆశీర్వచన నానికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఆ సందర్భంలో ఉపయోగించే అక్షింతలకూ అంతే ప్రాధాన్యం ఉంది. అక్షింతలు అంటే క్షయం కానివి పరిపూర్ణమైనవి అని అర్థం. విరిగిపోనీ ఎంచి ,పొట్టు తీసి, పసుపు, ఆవు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేస్తారు. ఇందులో బియ్యాన్ని చంద్రుడికి ప్రీతికగా చెబుతారు. మనం కారకో ఇతి చంద్రః అంటే చంద్రుడు మనసుకి కారకుడు లేదా అధిపతి.
మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి చిహ్నంగా బియ్యాన్ని ఉపయోగిస్తాం. అంతేకాదు బియ్యంలో కలిపే పసుపు గురువుకు ప్రతీక. గురు గ్రహం శుభ గ్రహం. అందుకే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
Why we use Akshintalu While Blessing, Importance