మార్చి 23 నుండి 31వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ స్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జెఈవో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
2020 శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
23-03-2020 (సోమవారం) ఉదయం: ధ్వజారోహణం, సాయంత్రం: పెద్దశేష వాహనం
24-03-2020 (మంగళవారం) ఉదయం: చిన్నశేష వాహనం, సాయంత్రం: హంస వాహనం
25-03-2020 (బుధవారం) ఉదయం: సింహ వాహనం, సాయంత్రం: ముత్యపుపందిరి వాహనం
26-03-2020 (గురువారం) ఉదయం: కల్పవృక్ష వాహనం, సాయంత్రం: సర్వభూపాల వాహనం
27-03-2020 (శుక్రవారం) ఉదయం: పల్లకీ ఉత్సవం, సాయంత్రం: గరుడ వాహనం
28-03-2020 (శనివారం) ఉదయం: హనుమంత వాహనం, సాయంత్రం: వసంతోత్సవం/గజ వాహనం
29-03-2020 (ఆదివారం) ఉదయం: సూర్యప్రభ వాహనం, సాయంత్రం: చంద్రప్రభ వాహనం
30-03-2020 (సోమవారం) ఉదయం: రథోత్సవం, సాయంత్రం: అశ్వవాహనం
31-03-2020 (మంగళవారం) ఉదయం: పల్లకీ ఉత్సవం/చక్రస్నానం , సాయంత్రం: ధ్వజావరోహణం
Note: Arjita Sevas, VIP Seva, Senior Citizen Darshan, physically challenged and Infant Darshan will be cancelled from 23 March to 31 March.