॥ Eatiki Dayaradu Sriramulu Telugu Lyrics ॥
పల్లవి:
ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను
ఏమిటికి రక్షింపవు శ్రీరాములు ఏ ॥
చరణము(లు):
పరులను వేడను శ్రీరాములు నీకే
కరములు చాచితి శ్రీరాములు ఏ ॥
పండ్రెండేండ్లాయెనే శ్రీరాములు బంది
ఖానలో యున్నాను శ్రీరాములు ఏ ॥
అర్థము తెమ్మనుచు నన్ను శ్రీరాములు
అరికట్టుచున్నారు శ్రీరాములు ఏ ॥
తానీషా జవానులు శ్రీరాములు నన్ను
తహశీలు చేసేరు శ్రీరాములు ఏ ॥
ముచ్చటాడవేమి శ్రీరాములు నీవు
ఇచ్చే యర్థములిమ్ము శ్రీరాములు ఏ ॥
నీచే గాకున్నను శ్రీరాములు మా
తల్లి సీతమ్మ లేద శ్రీరాములు ఏ ॥
మాతల్లి సీతమ్మకైన శ్రీరాములు నే
మనవి చెప్పుకొందునయ్య శ్రీరాములు ఏ ॥
ఆశించిన దాసుని శ్రీరాములు నీకు
పోషించు భారము లేదా శ్రీరాములు ఏ ॥
నిన్ను నమ్మినానయ్య శ్రీరాములు
గట్టిగ నా నెమ్మదిలో శ్రీరాములు ఏ ॥
వెడలిటు రారేమి శ్రీరాములు మీకు
విడిది భద్రాచలమా శ్రీరాములు ఏ ॥
వాసిగ భద్రాద్రి శ్రీరాములు రామ
దాసుని రక్షింపు శ్రీరాములు ఏ ॥
Also Read:
Sri Ramadasu Keerthanalu – Emitiki Dayaradu Sriramulu Lyrics in English | Telugu