Templesinindiainfo

Best Spiritual Website

Inakula Tilaka yemmayya Ramayya Lyrics in Telugu | Ramadasu Keerthana

Inakula Tilaka yemmayya Ramayya Telugu Lyrics:

పల్లవి:
ఇనకులతిలక ఏమయ్య రామయ్యా
శ్రీరామచంద్రా విని వినకున్నావు
వినరాదా నామొర శ్రీరామచంద్రా ఇ ॥

చరణము(లు):
కనకాంబరధర కపటమేలనయ్యా
శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా
జాగుసేయకు శ్రీరామచంద్రా ఇ ॥

దశరథసుత నాదశ జూడవయ్యా
శ్రీరామచంద్రా పశుపతి నుతనామ
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా ఇ ॥

నీవేగతియని నెర నమ్మియున్నాను
శ్రీరామచంద్రా కావవే యీవేళ
కాకుత్స్థ కులతిలక శ్రీరామచంద్రా ఇ ॥

వైకుంఠవాసుడ విని బాధ మాన్పవే
శ్రీరామచంద్రా నీకంటె గతిలేరు
నిర్దయజూడకు శ్రీరామచంద్రా ఇ ॥

రామ భద్రశైలధామ శ్రీరామ
శ్రీరామచంద్రా వేమరు వేడెద
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్రా ఇ ॥

Inakula Tilaka yemmayya Ramayya Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top