Templesinindiainfo

Best Spiritual Website

Manasama Neevu Maruvakuma Lyrics in Telugu | Ramadasu Keerthana

Manasama Neevu Maruvakuma Telugu Lyrics:

పల్లవి:
మానసమా నీవు మరువకుమా పెన్ని
ధానము రామమంత్రాను సంధానము మా ॥

చరణము(లు):
సారంపు గురుభక్తి మీరకుమీ సం
సారఘోరాటవిలో దూరకుమీ దరి
చేరని కోర్కెల గోరకుమీ అయి
దారింటి వెనువెంట బారకుమీ భ్రష్ట మా ॥

పరదైవములకు మ్రొక్కకుమీ స్త్రీలోల
సరసిజముఖులకు దక్కకుమీ ఘోర
నరకదుఃఖములెల్ల బాయుసుమీ దా
శరథికథామృత సారములోరుచి మ ॥

చిద్రూపము వెలుగొందుసుమీ అజ
రుద్రాదులకెల్ల విందుసుమీ దా
రిద్ర్యవ్యాధికి మందు సుమీ శ్రీ
భద్రాచల రామదాసపోషక భక్తి మా ॥

Manasama Neevu Maruvakuma Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top