Sri Venkateswara Prapatti Lyrics and Meaning in Telugu:
శ్రీ వేంకటేశ ప్రపత్తిః
ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీమ్
తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్ క్షాంతి సంవర్థనీమ్
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్. ॥ 1 ॥
తా. ఈ లోకములకు ఆధారమైనదియు, శ్రీ వేంకటేశ్వరునికి మిక్కిలి ఇష్టురాలును, అతని వక్షస్థలమందు నిత్యము నివసించుటచే ఆనందించునదియును, అతని యోరిమిని వృద్ధి చేయునదియును, రెండు హస్తములందును కమలములను ధరించునదియును పద్మాసనమున ఉండునదియును, వాత్సల్యము మున్నగు గుణములచే ప్రకాశించునదియు, భగవతియు, లోకములకు తల్లియు అగు లక్ష్మీదేవికి నమస్కార మొనర్తును.
శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్
స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 2 ॥
తా. శ్రీమంతుడవగు వేంకటేశ్వరా! నీవు దయాసముద్రుడవు. సమస్త లోకములకు సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. సర్వశక్తుడవు. సేవించువారి యెడల వాత్సల్యము కలవాడవు. సర్వస్వతంత్రుడవు. ప్రభువైనవాడవు. సుగుణములు కలవాడవు. ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షమవు. నీ పాదములనే శరణుజొచ్చెదను.
ఆనూపు రార్చిత సుజాత సుగంధి పుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ
సౌమ్యౌ సదానుభవనే పి నవానుభావ్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 3 ॥
తా. అందెలవరకును వ్యాపించిన మేలిరకపు పూల సువాసనచే పరిమళించునవియు, పొందికగా ఉన్నవియు, అందమైనవియు, నిత్యము చూచుచునే యున్నాను. క్రొత్తగా నుండి మనస్సును ఆకర్షించునవియు అగు శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు జొచ్చెదను.
సద్యో వికాసి సముదిత్త్వర సాంద్రరాగ
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్
సమ్యక్షు సాహస పదేషు విలేలయంతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 4 ॥
తా. అప్పుడే వికసించి, మనోహరముగా నుండి, ఎక్కువ పరిమళముతో నిండియున్న కమలముల పోలికలను సత్యముగా సాహసమే అని వెల్లడించుచున్న శ్రీ వేంకటేశవ్రుని పాదములనే శరణు పొందెదను.
రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర
వజ్రాంకుశాంబురహ కల్పక శంఖ చక్రైః
భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 5 ॥
తా. పరాత్పరుని చిహ్నములైన ధ్వజము, అమృతకలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము అను శుభకరములైన రేఖలతో కూడియున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.
తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 6 ॥
తా. పద్మరాగములను మించిన అరపాదములును, ఇంద్రనీలములను అతిక్రమించిన కాంతిగల మీగాళ్లును, చంద్రుని కాంతిని మించిన కాంతి గల గోళ్ళును కల శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.
స ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం
సంవాహనేపి సపది క్లమ మాదధానౌ
కాంతావవాఙ్మనసగోచర సౌకుమార్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 7 ॥
తా. లక్ష్మీదేవి మిక్కిలి ప్రేమతోను, భయముతోను తన మృదువైన చిగురు హస్తములతో భద్రముగా ఒత్తుచున్నా శ్రీ వేంకటేశ్వరుని పాదములు కందిపోవును. అవి మిక్కిలి సుందరములై చెప్పుటకుగాని, ఊహించుటకు గాని సాధ్యపడని సౌకుమార్యము కలిగియుండును. అట్టి పాదములనే శరణు పొందెదను.
లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీలాది దివ్య మహిషీ కరపల్లవానామ్
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 8 ॥
తా. శ్రీదేవి, భూదేవి వారితో సమానులగు నీలాదేవి మున్నగు భార్యల పాదపల్లవముల ఎఱ్ఱని కాంతి సంక్రమించుటచేతనో యనునట్లుగా మిక్కిలి ఎఱ్ఱగా వున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణుజొచ్చెదను.
నిత్యా నమద్విధి శివాది కిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహః ప్రరోహైః
నీరాజనా విధి ముదార ముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 9 ॥
తా. ప్రతిదినము నమస్కరించుచున్న శివుడు మున్నగు దేవతల కిరీటముల అగ్రభాగమునందు ఉన్నట్టివియు, మిక్కిలి ప్రకాశించునట్టివియు అగు నవరత్నములకాంతి సమూహమువలన నీరాజనమును పొందుచున్నవేమో అనునట్లు శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణు వేడెదను.
“విష్ణోః పదే పరమ” ఇత్యుదిత ప్రశంసౌ
యౌ ‘మధ్వఉత్స’ ఇతి భోగ్యతయా 7ప్యుపాత్తౌ
భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 10 ॥
తా. ఓ వేంకటేశ్వరా! నీ పాదములు ‘విష్ణోః పదే పరమ’ అని ఋగ్వేదమున స్తుతింపబడినది. ‘మద్య ఉత్స’ అని తేనెయూటలుగా, అను భవయోగ్యములుగా చెప్పబడినది. ‘ఆ మాట వాస్తవము’ అని తిరిగి నీవే నీ హస్త సంజ్ఞతో తెలుపుచున్నావు. అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను.
పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి
భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 11 ॥
తా. ఓ వేంకటేశ్వరా! అర్జునునకు తగిన సారథివైన నీవు అతనికి ‘నా పాదములనే శరణు పొందుము’ అని హితమును ఉపదేశించితివి. ఆ పాదములనే ఇప్పుడు నాకును ‘శరణు పొందుము’ అని హస్తములతో చూపుచున్నావు. అట్టి నీ చరణములనే శరణు పొందెదను.
మున్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరిసి శ్రుతీనామ్
చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 12 ॥
తా. ఓ వేంకటేశ్వరా! నా తలపైని, కాళీయుని పడగపైని, దుర్గమారణ్యములందును, శ్రీ వేంకటాచలము యొక్క శిఖరముపైని, ఉపనిషత్తుల యందును, వేఱే ఆలోచన లేక నిన్నే స్మరించువారి మనస్సునందున, నీ పాదములు భేదములేక సమానముగనే ఉండును. అట్టి నీ పాదములనే శరణు వేడెదను.
ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ
శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానౌ
ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 15 ॥
తా. ఓ వేంకటేశ్వరా! భూమిపైని, అంతటను చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలవియు, శ్రీ వేంకటాచల శిఖరమునకు అలంకారమైనవియు, జనులందరి మనస్సులకు, నేత్రములకు ఆనందమును కల్గించునట్టివియు అగు నీ పాదములనే శరణు వేడెదను.
ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 16 ॥
తా. ఓ వేంకటేశ్వరా! ఆర్తులగు జనులకు సదా తొట్టతొలుత సేవింపదగినవియు, బిడ్డకు తల్లి యొక్క స్తనములవలె జనుల కమృతము వంటివియు, పరస్పరము పోలిక కలవియు, వేరొక వస్తువుతో పోలిక లేనివియు అగు నీ చరణములనే శరణువేడెదను.
సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 17 ॥
తా. ఓ వేంకటేశ్వరా! సాత్త్వికగుణము గల వారిచే సేవింపబడువాడును, సంసారమును తరింపజేయు దయామయమగు కడకంటి చూపు కలవాడును అగు మణవాళ మహాముని చేత నే నీ పాదములు నాకు చూపబడినవి. అట్టి నీ పాదముల నే నేను శరణువేడెదను.
శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపే యతయా స్ఫురంత్యా
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యమ్. ॥ 18 ॥
తా. ఓ వృషశైవాధిపతీ! లక్ష్మీపతీ! మోక్ష మార్గమునకు నీవే ఉపాయభూతుడవు, నీవే ప్రాప్యుడవు. లక్ష్మీ దేవి నిన్నెల్లప్పుడును ఆశ్రయించి యుండుటవలన, ఆమెయును ఉపాయభూతురాలనును, ప్రాప్యురాలును అగుచున్నది. దోషరహితములైన గుణములు కల నీకే నేను సేవకుడనగుచున్నాను.
Also Read :
Sri Venkateswara Prapatti Lyrics in Hindi | English | Bengali | Kannada | Malayalam | Telugu | Tamil