preloader
Sun. May 3rd, 2026

Yenduku dayaradu Srirama Telugu Lyrics:

పల్లవి:
ఎందుకు దయరాదు శ్రీరామ
నేనేమి చేసితి శ్రీరామ ఎం ॥

చరణము(లు):
గతినీవే యనుకొంటి శ్రీరామ నా
వెత మాన్పవయ్య శ్రీరామ ఎం ॥

చేపట్టి రక్షింపవేల శ్రీరామ
నాప్రాపు నీవేనయ్య శ్రీరామ ఎం ॥

అయ్యయ్యో నానేరమేమి శ్రీరామ నా
కుయ్యాలింపవయ్య శ్రీరామ ఎం ॥

ఇంక నీదయ రాకుంటె శ్రీరామ నా
సంకట మెటుతీరు శ్రీరామ ఎం ॥

ఏండ్లు పండ్రెండాయెనే శ్రీరామ నీ
కండ్లకు పండుగె శ్రీరామ ఎం ॥

వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామ
దాసుని విడువకు శ్రీరామ ఎం ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *