Templesinindiainfo

Best Spiritual Website

2020 Virtual Varalakshmi Vratham From Tiruchanur Padmavathi Temple

Virtual Varalakshmi Vratham Live Telecast Timings:

On Sri Venkateswara Bhakti Channel from 10:00 AM to 12:00 noon.

భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) ద్వా‌రా ఇంటి నుండే వ్ర‌తంలో పాల్గొనే అవ‌కాశం – టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌

          సిరుల త‌ల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై  31న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఆయ‌న కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 

          ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది ప‌విత్ర‌మైన శ్రావ‌ణ మాసంలో నిర్వ‌హించే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌)‌లో ‌చేయాల‌ని టిటిడి నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. గ‌త ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో వీలైన‌న్ని ఆర్జిత సేవ‌ల‌ను ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) ప్ర‌క్రియ ద్వారా నిర్వ‌హించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌)‌లో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాలని అధికారులను ఆదేశించారు.  

       ఇందులో భాగంగా దేశ విదేశాల‌లోని భ‌క్తులు అమ్మ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని త‌మ త‌మ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించి, పాల్గొనే అవ‌కాశం టిటిడి క‌ల్పిస్తుంద‌న్నారు. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు జూలై 22వ తేదీ సాయంత్రం 5.00 గంట‌ల నుండి జూలై 30వ తేదీ సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు గృహ‌స్తులు టిటిడి వెబ్‌సైట్ ద్వారా పొంద‌వ‌చ్చ‌న్నారు. టికెట్లు కావ‌ల‌సిన గృహ‌స్తులు టిటిడి వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాలు పొందుప‌ర్చి, టిటిడి నియ‌మ నిబంధ‌న‌లకు లోబ‌డి గేట్‌వే ద్వా‌రా రూ.1001/- చెల్లించి ఆన్‌లైన్ ర‌శీదు పొంద‌వ‌చ్చ‌ని, ఇందులో గృహ‌స్తుల‌కు ప్ర‌సాదాలు అందించేందుకు పోస్ట‌ల్ సేవ‌లు క‌లిపి రుసుం నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు తొలి శ్రావ‌ణ శుక్ర‌వారం పూజ‌లో అర్పించిన ఉత్త‌రియం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, కంక‌ణాలు, గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జూలై 31వ తేదీ ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) లో ఉద‌యం 10.00 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ వ్ర‌తంలో పాల్గొనే గృహ‌స్తులు అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర నామాలు, సంక‌ల్పం ప‌ఠించాల్సి ఉంటుంద‌న్నారు. కాగా, ఆన్ లైన్ లో టికెట్లు పొందిన గృహ‌స్తుల పేరు, గోత్ర నామాల ప్రతిని అర్చకులు అమ్మవారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారన్నారు.

Tiruchanoor Sri Padmavathi Ammavari Temple

         వ‌ర‌లక్ష్మీ వ్ర‌తం‌ పూర్తిగా ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) సేవ అయినందున, ఈ వ్ర‌తం కొర‌కు పేర్లు న‌మోదు చేసుకుని, టికెట్లు పొందిన భ‌క్తుల‌కు తిరుచానూరు అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌త్య‌క్షంగా వ్ర‌తంలో పాల్గొనే అవ‌కాశం లేద‌ని తెలిపారు. విదేశాల‌లో ఉన్న భ‌క్తులు ఆన్‌లైన్ టికెట్లు ‌పొంది ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) ద్వారా ఈ వ్ర‌తంలో పాల్గొన‌వ‌చ్చు, కానీ వారికి ప్ర‌సాదాలు పంప‌డం సాధ్యం కాదని తెలియ‌జేశారు. 

ప్రాశ‌స్త్యం –

       శ్రీ అలిమేలుమంగ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తపోదీక్షకు ప్రతిఫలంగా సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ తిరుచానూరులోని పద్మసరోవరంలో అవతరించింది. ప్రతి సంవత్సరం పవిత్రమైన శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ పూజలతో సమానంగా భక్తులు విశ్వసిస్తారు. స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సిన విధానాన్ని తెలియజేశాడు. ఈ ప్ర‌కారం ఉదయాన్నే మంగళస్నానం చేసి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీదేవిని దర్శించాలి. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు.  

2020 Virtual Varalakshmi Vratham From Tiruchanur Padmavathi Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top