Thirumala Nambi History in Telugu:
`తిరుమల చరిత్ర గురించి వినేటప్పుడు చాలా సందర్భాలలో “తిరుమల నంబి ” అను ఒక పరమ భక్తుడి గురించి వింటూ ఉంటాం , అసలు ఈ ‘ తిరుమల నంబి ‘ ఎవరు?
సుమారు 1000 సంవత్సరాల క్రితం, తిరుపతికి ధగ్గరగా ఉన్న తిరుమల కొండలలో గొప్ప భక్తుడైన తిరుమల నంబి నివసించారు. తిరుమల నంబికి శ్రీశైల పూర్ణులు అనే మరో నామధేయము ఉంది.
ఆ రోజుల్లో తిరుమల ఆలయం యొక్క పూజాధి కార్యక్రమాల నిర్వహణ చాలా కష్టమైన పని.
యెంధుకంటే తిరుమల ఆలయం రాతి కొండలపై ధట్టమైన అటవీ ప్రాంతంలో వుండేధి, కనుక ఆ అడవి మార్గాన వెళ్ళి రావడం అత్యంత కష్టమైన పని.
అయిననూ తిరుమల నంబి తన జీవిత కాలమంత ఒక పురే గుడిసెలో నివసించుచు తిరుమల ఆలయం యొక్క నిర్వహణ, పరిపాలన, మరియు ఆ దేవవుని ప్రార్ధనలకు సేవకె అంకితం చేశారు.
సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుని చే ” తాత ” అని పిలిపించుకున్న ఈ తిరుమల నంబి గారికి స్వామి అనుగ్రహం ఎలా కలిగింధో ఇప్పుడు వువరించ చూద్ధాం.
ధట్టమైన ఆటవిప్రాంతంలో వున్న శ్రీ వేంకటేశ్వర సమి సన్నిధికి, పరమభాగవతోత్తముడైన తిరుమలనంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యం కైంకర్యమే మహాదానందం తో పాపనాశనానం నుండి నీటికుండ నెత్తిన ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవారు.
ఒక రోజు తిరుమలనంబి శ్రమను తీర్చదలచిన ఆ పరమాత్ముడు బోయవాని రూపంలో ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి అభిషేక జాలం తెచ్చే దారిలో ఉన్న ఒక చెట్టునీడన కూర్చున్నారు.
చెట్టు ధగ్గరకు వచ్చిన నంబిని, దాహంగా ఉంది గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అని అడిగారు. బాలుని చూసిన నంబి బాలకా ! ఇది స్వామి అభిషేకిం కొరకు తీసుకు వెళ్తున్న దివ్యజలం. కనుక నీవు అడగరాదు నేనివ్వరాదు అన్నారు. అయిననూ బోయవాని రూపంలో వున్న స్వామీ తాతా ! నీరు పోసి ప్రాణం రక్షించవా ? అని అడిగారు.
నీ దాహం తీర్చాల్సినవాడు ఆ భగవంతుడు. కావున భగవంతుని ప్రార్థించు అతడే ప్రాణరక్షకుడు అని చెప్పి స్వామి అభిషేకమునకు నాకు సమయాతీతం అవుతున్నదని వేగంగా నడవ సాగాడు నంబి.
నంభి తీసుకెళుతున్న కుండకు తన బాణంతో చిల్లు వేసి ధాహం తీర్చుకున్నారు ఆ పరమాత్ముడు.
కుండ తేలికైంధన్న అనుమానంతో తిరుమల నంబి తన కుందను చూసారు.
బాలుడు చేత బాణం చే కుండకు ఏర్పడిన రంధ్రం నుండి నేర్రు మొత్తం పోయినట్లు గ్రహించిన నంబి అయ్యో స్వామి వారికి తెచ్చిన అభిషేక జాలం పూర్తిగా ఖాళి అయినధే అని చెబుతూ హతాశుడై కూలబడ్డాడు.
బాలక వృద్దుడైన నీను ఇప్పటికిప్పుడు అభిషేక జాలం యేల సన్నిధికి చేర్చగలను అని గొల్లుమన్నాడు. కన్నీరు కాలువలా పారింధి, అది చూచిన స్వామి ఎంతటి భక్తి నా పై ఉంచాదో అని నివ్వెరపోయాడు.
అంతటితో స్వామి నంబి చేయి పట్టుకొని “తాతా లే నీకు నీను పవిత్రజలం చూపుతాను నాతొ రా అని తీసుకువెళ్లి ఆకాశాన్ని అంటినట్లున్న ఒక యెత్తైన కొండకు తన బాణం ఎక్కుపెట్టి కొట్టారు. మిరమిట్లు మెరుపుతో కొండనుంచి.
జలధార జాలువారింధి. అదే ఆకాశగంగ తీర్థంగా ఇప్పుడు మనం పిలుస్తున్నాం.
తాత ఇకమీద్ధత ఇక్కడ నుంచే స్వామివారికి అభిషేక జాలం తీసుకువెళ్ళు అని ఆ పరమాత్ముడు అధృశ్యమైనారు.
స్వామివారి లీలాను గ్రహించిన నంబి, కాలాతితం కాకూడదు అని అనుకుని ఆకాశగంగ తీర్థంతో ఆలయానికి చేరుకుని స్వామి వారికి అభిషేకం చేయించాడు.
నాటి నుంచి ఇప్పటికీ ఆకాశగంగ తీర్థంతోనే శ్రీవేంకటేశ్వరస్వామికి అభిషేకం జరిపించడం విశేషం.
ఆకాశ గంగా తీర్థ కైంకర్యం, తోమాల సేవ, మంత్రపుష్ప కైంకర్యం, సాతుమరై, తిరుమంజనం, వెధపరాయనం, అను కైంకర్య సేవలను ప్రవేశపెట్టెన నంబికి
తిరుమల “ఆచార్య పురుష” అనే నామకరణం తో సత్కరించినారు వెధ పండితులు.
నంబి యొక్క నియమపూర్వకమైన గొప్ప భక్తి గౌరవార్ధం ఇప్పటికీ తీర్థ కైంకర్య సేవలను జరిపించు బాధ్యత తన వంశస్థులకే అప్పగించబడినధి.
ఆచార్య తిరుమల నంబి విగ్రహం ప్రతిష్టించబడిన ఆలయం నుంచే తన వారసులు కైంకర్య సేవలను నిర్వహిస్తున్నారు.