1) భద్రాద్రిలో సీత రాముల కల్యాణానికి వాడే కోటి తలంబ్రాలను చేతితో తయారు చేస్తారు అంటే తలంబ్రాలకు కావలసిన బియ్యాన్ని మిషన్ల తోనూ, దంచడం కాకుండా ఓపికగా ఒక్కో గింజల్ని ఒలిచి బియ్యం తీస్తారు .వాటిని తలంబ్రాలుగా చేస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా.
2) రాములవారి కళ్యాణం కోసం వాడే మంగళ సూత్రాన్ని 18 వ శతాబ్దంలో భక్తరామదాసు చేయించాడు. దానిని ఇప్పటికీ కల్యాణంలో వాడుతున్నారు.
3) భద్రాద్రి కళ్యాణం అంటే బాగా ఫేమస్ ముత్యాల తలంబ్రాలు వాటిని అప్పట్లో తానీషా సమర్పిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సమర్పిస్తోంది.
4) సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడికి భక్తులు ఆభరణాలు చేయిస్తారు. కానీ భద్రాద్రి గుడిలో రాముడి కి అలంకరించే నగల ఖర్చును స్వయంగా రాముడే చెల్లించుకున్నాడు. మొత్తం ఆరు లక్షల రూపాయల ఖర్చును అప్పుడు తానీషాకు త్రేతాయుగం నాటి శ్రీరామ టెంకలు రూపంలో ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. ఇప్పటికి ఆ నాణాలు టెంపుల్ మ్యూజియం లో చూడవచ్చు.
5) ఆలయంలో రాముడు కొలువైన గర్భగుడి గోపురం సింగల్ గ్రానైట్ తో చెక్కారు. దాని బరువు 36 టన్నులు.
6) అదే గర్భగుడి విమాన గోపురంపై కనిపించే సుదర్శన చక్రాన్ని ఎవరు చేయించలేదు. గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా కొట్టుకువచ్చి రామదాసు చేతిలోకి వచ్చింది. దాన్ని అక్కడ ప్రతిష్టించారు.
7) రామదాసు పేరు చెపితే భద్రాద్రి ఎంతో గోల్కొండ కోట కూడా అంతే. సర్కార్ ఖజానాను కాజేశారు అన్న కోపంతో ఆయనను బంధించిన గది రామదాసు బందీఖాన గా ఇప్పటికీ కోటలో కనిపిస్తుంది. దానిలో లో స్వయం గా రామదాసు చెక్కిన సీతారామ హనుమంతుల ప్రతిమలు చూడవచ్చు.
8) భద్రాద్రి రాముని దర్శించిన ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు వైకుంఠాన్ని అక్కడ చూసారట. అందుకే ఈ ఆలయంలో దేవుడికి వైకుంఠ రాముడు అని పేరు.
9) రాముడు భద్రుడు కోరిక మేరకు భద్రగిరి పై వెలిసాడు .అందుకే గర్భగుడి పక్కనే భద్రుడి ఆకారం కూడా కొండల కనిపిస్తుంది. దానికి చెవి ఆనించి వింటే శ్రీరామ నామం వినిపిస్తుందని కొందరు చెప్తుంటారు.
జైశ్రీరామ్ జై జైశ్రీరామ్