Home » Hindu Mantras » Ramadasu Keertanas » Elagu Taḷudu Nemi Setura Lyrics in Telugu | Ramadasu Keerthana
Ramadasu Keertanas

Elagu Taḷudu Nemi Setura Lyrics in Telugu | Ramadasu Keerthana

Elagu Taḷudu Nemi Setura Telugu Lyrics:

పల్లవి:
ఏలాగుతాళుదు నేమిసేతురా రామా
ఈ జాలిచేతను తాళజాలనురా రామా ఏ ॥

చరణము(లు):
దీనజనులకెల్ల దిక్కునీవే రామా
మనమున నిన్ను నేమరవనో రామా ఏ ॥

పావనమూర్తియో పట్టాభిరామా
కావవే ఈవేళ కౌసల్యరామా ఏ ॥

శరణని నీమరుగు జేరితిరామా
శరణంటె కాచేది బిరుదు రఘురామా ఏ ॥

చెప్పరాని ప్రేమ నెందుదాతుర రామా
ఆపన్నరక్షకుడ నాపాలి శ్రీరామా ఏ ॥

నీ సొమ్మునేననుట నిజమాయెరా రామా
నా దోషములనన్ని దొలగింపవె రామా ఏ ॥

రాతికైన చెమట రంజిల్లునే రామా
ఆతీరు నీమనసునొందదే శ్రీరామా ఏ ॥

యమబాధ లొందగ నేరనో రామా
యమదండనలులేక యెడబాపురామా ఏ ॥

వాసిగ రామకీర్తనలు జేసితి రామా
దాసుడను నా మీద దయయుంచుమీ రామా ఏ ॥

Add Comment

Click here to post a comment