Annamayya Keerthana – Chaaladaa Brahmamidi Lyrics in Telugu:
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు |
జాలెల్ల నడగించు సంకీర్తనమ్ ||
సంతోష కరమైన సంకీర్తనమ్ |
సంతాప మణగించు సంకీర్తనమ్ |
జంతువుల రక్షించు సంకీర్తనమ్ |
సంతతము దలచుడీ సంకీర్తనమ్ ||
సామజము గాంచినది సంకీర్తనమ్ |
సామమున కెక్కుడీ సంకీర్తనమ్ |
సామీప్య మిందరికి సంకీర్తనమ్ |
సామాన్యమా విష్ణు సంకీర్తనమ్ ||
జముబారి విడిపించు సంకీర్తనమ్ |
సమ బుద్ధి వొడమించు సంకీర్తనమ్ |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనమ్ |
శమదమాదుల జేయు సంకీర్తనమ్ ||
జలజాసనుని నోరి సంకీర్తనమ్ |
చలిగొండ సుతదలచు సంకీర్తనమ్ |
చలువ గడు నాలుకకు సంకీర్తనమ్ |
చలపట్టి తలచుడీ సంకీర్తనమ్ ||
సరవి సంపదలిచ్చు సంకీర్తనమ్ |
సరిలేని దిదియపో సంకీర్తనమ్ |
సరుస వేంకట విభుని సంకీర్తనమ్ |
సరుగనను దలచుడీ సంకీర్తనమ్ ||
Also Read :
Chaaladaa Brahmamidi Lyrics in Hindi | English | Bengali | Kannada | Malayalam | Telugu | Tamil