Iksvsku Kulatilaka Ikanaina Telugu Lyrics:
పల్లవి:
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ ॥
చరణము(లు):
చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ ॥
గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను
క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ ॥
భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా
ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ ॥
శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ఇ ॥
లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ ॥
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ ॥
వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా ఇ ॥
కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా ఇ ॥
మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ఇ ॥
అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా ఇ ॥
సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా
దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా ఇ ॥
ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా
నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా ఇ ॥
కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా ఇ ॥
భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా