Itadena ee Lokamulo Telugu Lyrics:
పల్లవి:
ఇతడేనా ఈ లోకములో గల
పతితుల నెల్లను పావనము చేయువాడు ఇ ॥
చరణము(లు):
పరిపూర్ణకరుణచే బ్రహ్మాదుల గాచిన
నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు ఇ ॥
ఇల లంకపురమున అవనిజను బ్రోవ
బలుడైన రావణుని పరిమార్చినవాడు ఇ ॥
అలనాడు ద్రౌపతికి అక్షయవలువలు
వల నొప్పనొసగిన వైకుంఠవాసుడు ఇ ॥
ఏ వేళ మునివరులు నితర చింతలు మాని
కేవలము మదినుంచి కొలువు గాచెడువాడు ఇ ॥
ప్రేమను దయతో నాపన్నుల బ్రోచుచు
రామదాసునేలు రామచంద్రవిభుడు ఇ ॥
Itadena ee Lokamulo Lyrics in Telugu | Ramadasu Keerthana