Rama Rama Rama Rama Srirama Telugu Lyrics :
పల్లవి:
రామ రామ రామ రామ శ్రీరామ రా ॥
చరణము(లు):
రామ రామ యని వేమరు నామది
ప్రేమమీర నిను పిలిచిన పలుకవు రా ॥
తలచినపుడె చాల ధన్యుడనైతిని
పిలిచిన పలుకవు పీతాంబరధర రా ॥
తిలకము దిద్దిన తీరైన నీమోము
కలనైన చూపవు కౌస్తుభభూషణ రా ॥
శంఖచక్రము లిరువంకల మెరయగ
పొంకముతో నా వంక జూడవేమి రా ॥
పరమపురుష భద్రగిరిరామదాసుని
కరుణ నేలుమని శరణని వేడితి రా ॥
Rama Rama Rama Rama Srirama Lyrics in Telugu | Ramadasu Keerthana