Rama Rama Srirama Telugu Lyrics:
పల్లవి:
రామ రామ శ్రీరామ రామరామ యనరాదా మనసా
కామిత ఫలదుండగు శ్రీ సీతాకాంతుని గనరాదా మనసా రా ॥
చరణము(లు):
సలలితముగ రఘువరునకు సింహాసన మియ్యగరాదా మనసా
నళినభవాభవ పరివేష్ఠితు ధ్యానము చేయగరాదా మనసా రా ॥
బలుడౌ రాముని రమ్మని యావాహన చేయగరాదా మనసా
వెలయగ పాద్యము శ్రీభద్రాచల భవనునకీరాదా మనసా రా ॥
ఆదిత్యార్చితుడగు శ్రీరాముని కర్ఘ్యం బియ్యగరాదా మనసా
వేదవేద్యునకు ఆగమోత్తముకు వస్త్రములియ్యగరాదా మనసా రా ॥
నాదస్వరూపుని కర్ధమెయని స్నానమొనర్పగరాదా మనసా
పాదార్చిత భూవిభున కద్భుతవస్త్రము లీయగరాదా మనసా రా ॥
భూతదయాధిపునకు నీవెపుడుపవీతం బియ్యగరాదా మనసా
ఖ్యాతిగ దశరథసుతునకు శ్రీగంధంబిపుడీయగరాదా మనసా రా ॥
కేతకికుసుమములు జాలును నీకివె యని యనరాదా మనసా
శ్రీతులసీ దళములు కొని నీ వాశ్రితవరునకీరాదా మనసా రా ॥
కపిలఘృతంబున ధూపదీపములు గావింపగరాదా మనసా
నృప సత్తమునకు దీపారాధన మిపుడీయగరాదా మనసా రా ॥
తపసుల పాలిటి వానికి నైవేద్యము చేయగరాదా మనసా
కృపణవిరోధికి తాంబూలంబులు నిపుడె యీయగరాదా మనసా రా ॥
నృత్యగీత వాద్యంబుల నాతని తృప్తుచేయగరాదా మనసా
చిత్తజ జనకుని మత్తతలేకను హత్తియుండరాదా మనసా రా ॥
మెత్తనిశయ్యను మేలగుదిండ్లను నొప్పుగనీరాదా మనసా
ఎత్తరినైనను మరువక శ్రీహరి భక్తి సలుపరాదా మనసా రా ॥
రాముడు కొలువై యుండెడువేళ పరాకు చెప్పరాదా మనసా
రామునినామ మేమరకెప్పుడు వేమరు తలపగరాదా మనసా రా ॥
రామదయాళో సీతాహృత్కామ యనరాదా మనసా
శ్రీమద్భద్రాచలధామ శ్రీరామ యనరాదా మనసా రా ॥