Rama Rama Yani Nota Telugu Lyrics:
పల్లవి:
రామ రామ యని నోట రవ్వంత సేపైన
నీమము తప్పక మంచి నీతితో పల్కని వా
డున్మత్తుడు మూఢచిత్తుడు రా ॥
చరణము(లు):
దేహమశాశ్వతమని తెలియక దుర్బుద్ధిచేత
సాహసమున సాధుజనుల సంకటబెట్టెడివాడు
పాతకి బ్రహ్మఘాతకి రా ॥
దుర్బుద్ధిచేత నేను దండించగలనని చాలా
చెండితనమున పరుల దండింప గోరెడివాడు
నిక్కునా భువిలో దక్కునా రా ॥
మన్ననతో పిన్నపెద్దల కనుల కానకను భాగ్య
మున్నదని గర్వమున అన్నము బెట్టనివాడు
హీనుడు దుస్సంధానుడు రా ॥
దూరభారము తెలియలేక దుర్బుద్ధి తలపోసి
మేరతప్పి పరసతుల మెల్లన పొందెడివానికి
మోసము చాల దోషము రా ॥
స్నేహము చేసినవానికి ద్రోహము చేసినవాని
కూహకమున యమదూతలు కుత్తుకలు మండుకత్తుల
కోతురు కొరత వేతురు రా ॥
రామదాసునేలినట్టి ప్రేమగల శ్రీభద్రశైల
రామచంద్రుల కామించి రక్షించుమని కొలువక
గొబ్బున మోక్షమబ్బున రా ॥
Rama Rama Yani Nota Lyrics in Telugu | Ramadasu Keerthana