Ramachandraya Janakarajaja Telugu Lyrics:
పల్లవి:
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం రా ॥
చరణము(లు):
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాదివినుత సద్వరాయ మంగళం రా ॥
చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగళం రా ॥
లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలదసదృశ దేహాయ చారు మంగళం రా ॥
దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజ గురువరాయ భవ్యమంగళం రా ॥
పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజవాహనాయ అతులమంగళం రా ॥
విమలరూపాయ వివిధవేదాంత వేద్యాయ
సుముఖచిత్త కామితాయ శుభదమంగళం రా ॥
రామదాసాయ మృదుల హృదయ కమలనివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రా ॥
Ramachandraya Janaka Rajaja Lyrics in Telugu | Ramadasu Keerthana