Ramuni Varamu Makemi Lyrics:
పల్లవి:
రామునివారము మాకేమి విచారము
స్వామి నీదేభారము దాశరథి నీవాధారము రా ॥
చరణము(లు):
తెలిసి తెలియనేరము మా దేవునిదే యుపకారము
తలచిన శరీరము మది పులకాంకురపూరము రా ॥
ఘోరాంధకారము సంసారము నిస్సారము
శ్రీరాముల యవతారము మదిచింతించుట వ్యాపారము రా ॥
ఎంతెంతో విస్తారము అవతల యొయ్యారము
ఎంతో శృంగారము మా సీతేశుని యవతారము రా ॥
ఇతరుల సేవ కోరము రఘుపతినే నమ్మినారము
అతిరాజసుల జేరము మా రాముని దాసులైనాము రా ॥
Also Read:
Sri Ramadasu Keerthanalu – Ramuni Varamu Makemi Lyrics in English | Telugu
Ramuni Varamu Makemi Lyrics in Telugu | Ramadasu Keerthana