Ramadasu Keertanas

Dasaradhii Karunaapayonidhi Lyrics in Telugu | Sri Ramadasu Movie Songs

Dasaradhii Karunaapayonidhi Telugu Lyrics :

దాశరధీ కరుణాపయోనిధి
నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమి
దాశరధి కరుణాపయోనిధి

గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కాని
ఏల రావు…నన్నేల రావు…నన్నేల ఏల రావు
సీతా రామస్వామి….
రామ రసరమ్య ధామ రమణీయ నామ
రఘువంశ సోమ రణరంగ భీమ
రాక్షస విరామ కమనీయ కామ
సౌందర్య సీమ నీ రధ శ్యామ
నిజభుజోద్దామ భుజనల లామ
భువన జయ రామ
పాహి బద్రాద్రి రామ పాహి
తక్షణ రక్షణ విశ్వ విలక్షణ
ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాండడ డాండ డాండ నినదమ్ముల
జండము నిండ భస్మ వేదండము
నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమ రసాంతరంగ హృదయంగ మశుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ
సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు దుశంగా విభంగా
భూతల పతంగ మధు మంగళ రూపము చూపవేమిరా
గరుడ గమన రారా గరుడ గమన రారా

Also Read:

Sri Ramadasu Movie Song – Dasaradhii Karunaapayonidhi Lyrics in English | Telugu

Add Comment

Click here to post a comment