Ramadasu Keertanas

Etubotivo Rama Etubrotuvo Lyrics in Telugu | Ramadasu Keerthana

Etubotivo Rama Etubrotuvo Telugu Lyrics:

పల్లవి:
ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో రామ ఎ ॥

చరణము(లు):
ఎటుబోతివో నిన్ను వేడుకొంటే
కటకటానేడు నా కనుల జూతామంటె ఎ ॥

అంధకారమువంటి బంధిఖానాలో నున్న
నింద బాపవదేల మ్రొక్కెద స్వామి ఎ ॥

పాపములన్నియు యెడబాపే దొరవు నీవు
ఆపద దీర్చి నన్నాదుకొమ్మంటి స్వామి ఎ ॥

తానీషాగారు వచ్చి సరితీర్పు జేసెదరు
పన్నుల పైకము బంపి బంధిఖానా వదిలించు ఎ ॥

అపరాధినని చాల నుతిచేసి మొరలిడగ
నెపమెంచి విడిచేవు నేరములు తలచి ఎ ॥

అప్పులవారొచ్చి యరికట్టుచున్నారు
ఒప్పుకోబడునని చెప్పక దాగినావు ఎ ॥

నీవు భద్రాచలనిలయుడవయ్యు రామ
బ్రోవుమయ్య రామదాసు నేలెడిస్వామి ఏ ॥

Add Comment

Click here to post a comment