Ramadasu Keertanas

Evaru Dusincinanemi Mari Lyrics in Telugu | Ramadasu Keerthana

Evaru Dusincinanemi Mari Telugu Lyrics:

పల్లవి:
ఎవరు దూషించిననేమి మరి ఎవరు దూషించిననేమి
అవగుణముమాన్పి యార్చేరా తీర్చేరా
నవనీతచోరుడు నారాయణుడుండగ ఎ ॥

చరణము(లు):
పిమ్మట నాడిననేమి మంచి ప్రియములు పలికిననేమి
కొమ్మరో రమ్మని కోరిక లొసగెడి సమ్మతి నాపాలి సర్వేశ్వరుండుండగ ఎ ॥

వాని పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల భాషించువారితో
పలుమారు పొందేల కాచి రక్షించెడి ఘనుడు రాముడుండగ ఎ ॥

అపరాధముల నెంచువారు మాకు ఉపకారులైయున్నారు
విపరీత చరితలు వినుచు నెల్లపుడు కపటనాటకధారి కనిపెట్టియుండగ ఎ ॥

వారి వన్నెలు సల్పనేల మూడువాసనలకు భ్రమయనేల
వాసిగ భద్రాద్రివాసుడై నిరతము భాసురముగ రామదాసుడై యుండగ ఎ ॥

 

Add Comment

Click here to post a comment