Kalaye Gopalam Kasturitilakam Telugu Lyrics:
చరణము(లు):
కలయె గోపాలం కస్తూరితిలకం సుఫాలం గోపాలం
కుండలరుచిరకపోలం జలజసన్నిభకాంతి కాంతం
జగన్నాథపుర నిశాంతం క ॥
అనుపమరూపం మహితమణి కనకకలాపం గోపాలం
విగతగోప వనితానుతాపం మునిమనోజతరణిం
వనజసన్నిభచరణం క ॥
అమితద్విజాతం కరాంబుజం నవనీతం గోపాలం
కమలభవ భవమునిగీతం వివిధ కుసుమాలంకారం
విమల బృందావనహారం క ॥
భాసిత భానుం భద్రాద్రినివాసనిధానం శ్రీరామం
దివ్యానంద భాసురగానం రాసకేళి విరాజమానం
రామదాస స్తుతి నిధానం క ॥
Add Comment