Ramadasu Keertanas

Namanavini Vini Vega Praṇanatha Lyrics in Telugu | Ramadasu Keerthana

Namanavini Vini Vega Praṇanatha Lyrics:

పల్లవి:
నామనవిని విని వేగ ప్రాణనాథా
రామదాసుని వదలించుము ప్రాణనాథా నా ॥

చరణము(లు):
ప్రాచ్ఛాయ నేమ్లేచ్ఛుడు ప్రాణనాథా
తుచ్ఛతుచ్ఛ వాక్యము లాడెనయ్య ప్రాణనాథా నా ॥

దాసుని లక్ష పైకము దెమ్మనుచు ప్రాణనాథా
ఎంతో శిక్ష చేయుచునాడయ్య ప్రాణనాథా నా ॥

శరణన్న రక్షింతునని ప్రాణనాథా
శరణాగత బిరుదువహించిన ప్రాణనాథా నా ॥

తురక పైకము చెల్లించను ప్రాణనాథా
ఎంతో త్వరితముగ వేంచేయుడీ ప్రాణనాథా నా ॥

సీతాదేవి పలుకులకు చిత్తమందు రాములు
సంతసించి వెడలెను తమ్మునితో ముందు నా ॥

Add Comment

Click here to post a comment