Rama Rama Yani Nota Telugu Lyrics:
పల్లవి:
రామ రామయని నోట రవ్వంతసేపైన
నీమము తప్పక మంచి నీతితో బల్కనివాడు మత్తుడు యంధచిత్తుడు రా ॥
చరణము(లు):
దేహమశాశ్వతమని తెలియని దుర్బుద్ధిచేత
సాహసమున సాధుజనుల సంకట పెట్టెడివాడు పాతకి బ్రహ్మఘాతకి రా ॥
దుర్బుద్ధిచేత సాహసమున నేను దండివాడననుచు చాల చండితనము
కలిగిన పరుల దండను గోరెడువాడు నిక్కునా భువిలో దక్కునా రా ॥
మన్ననతో పిన్న పెద్దల కన్నులు కానకను భాగ్యమున్నదని
గర్వమున అన్నము బెట్టనివాడు హీనుడును స్సంధానుడు రా ॥
ఎంతో కలిగియున్న దానధర్మము లేనివాడు
హీనుడయ్యు భూమిలో నెన్నాళ్ళు బ్రతికిన నేటికి ముమ్మాటికి రా ॥
పనిపాట తెలియకను పరుల ద్రవ్యమపహరించి
కరుణలేకయే పేదసాదల కష్టపెట్టెడివాడు తట్టునా రా ॥
దూరభారము తెలియక దుర్బుద్ధి తలపోసి
మేరతప్పి పరసతుల మెల్లమెల్లగపొందెడువానికి మోసము చాలదోషము రా ॥
స్నేహము చేసినవారికి ద్రోహము చేసినవాని కూహాకమున
యముని దూతలు కుత్తుకలను మండు కత్తుల గోతురు గోతవేతురు రా ॥
రామదాసునేలినట్టిప్రేమతో శ్రీభద్రశైల
రామచంద్రుల కామించి కొలువకున్న గొబ్బునా మోక్షమబ్బునా రా ॥
Also Read
Sri Ramadasu Keerthanalu – Rama Rama Yani Nota Lyrics in English | Telugu