Ramadasu Keertanas

Ramaho Raghuramaho Lyrics in Telugu | Ramadasu Keerthana

Ramaho Raghuramaho Telugu Lyrics:

పల్లవి:
రామహో రఘురామహో హే సీతా
రామ హో రఘురామ హో రా ॥

చరణము(లు):
రామహో భద్రశైలధామ హో భక్తపాల
నేమహో సీతాలోలస్వామి హో సత్యశీల హో రా ॥

అగణితగుణధామ అజభవనుత నామ
నగధర మేఘశ్యామ నత జనాశ్రితకామ రా ॥

శరధిబంధన శౌర్య శతృసంహారధైర్య
గురుజనకార్యధుర్య కోమలాంగ సౌందర్య రా ॥

శరదిందునిభానన శతమన్మథసమాన
నిరుపమానంద ఘననిజదాసావన రామ రా ॥

Add Comment

Click here to post a comment